Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

బుగ్గారం మండలం (జగిత్యాల జిల్లా)

వికీపీడియా నుండి
బుగ్గారం
—  మండలం  —
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, బుగ్గారం స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, బుగ్గారం స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, బుగ్గారం స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల జిల్లా
మండల కేంద్రం బుగ్గారం (బుగ్గారం)
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 81 km² (31.3 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 21,716
 - పురుషులు 10,605
 - స్త్రీలు 11,111
పిన్‌కోడ్ {{{pincode}}}


బుగ్గారం మండలం తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన జగిత్యాల నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 11 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం జగిత్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం బుగ్గారం.

గణాంకాలు

[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 81 చ.కి.మీ. కాగా, జనాభా 21,716. జనాభాలో పురుషులు 10,605 కాగా, స్త్రీల సంఖ్య 11,111. మండలంలో 5,490 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన మండలం

[మార్చు]

లోగడ బుగ్గారం  గ్రామం కరీంనగర్ జిల్లా, జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలోని ధర్మపురి మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా బుగ్గారం గ్రామాన్ని గ్రామాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా జగిత్యాల జిల్లా,జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. బుగ్గారం
  2. చిన్నాపూర్
  3. వెల్గొండ
  4. సిరివంచకోట
  5. గోపులాపూర్
  6. మద్నూర్
  7. సిరికొండ
  8. బీర్సాని
  9. గంగాపూర్
  10. యశ్వంతరావుపేట
  11. శకళ్ళ

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2019-01-27.
  2. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు

[మార్చు]