జగిత్యాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జగిత్యాల, భారతదేశంలోని ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాకు చెందిన పట్టణం,అదే జిల్లాకు చెందిన ఒక మండలం.[1].

  ?జగిత్యాల
తెలంగాణ • భారతదేశం
టవర్ సర్కిల్, జగిత్యాల
టవర్ సర్కిల్, జగిత్యాల
అక్షాంశరేఖాంశాలు: 18°48′N 78°56′E / 18.8°N 78.93°E / 18.8; 78.93
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 28.25 కి.మీ² (11 చ.మై)[2]
జిల్లా(లు) కరీంనగర్ జిల్లా
జనాభా
జనసాంద్రత
96,460[3] (2011 నాటికి)
• 3,415/కి.మీ² (8,845/చ.మై)
భాష(లు) తెలుగు
పురపాలక సంఘం జగిత్యాల పురపాలక సంఘము

నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు జరగకముందు కరీంనగర్ జిల్లా లోని ఒక పట్టణము మరియు రెవెన్యూ డివిజను,మరియు మండలం.ఇది మండల కేంద్రమైన జగిత్యాల నుండి 3 కి. మీ. దూరంలో ఉంది.హైదరాబాదు నుండి 5 గంటల రోడ్డు ప్రయాణ దూరంలో (దాదాపు 230 కి.మీ.) జగిత్యాల ఉంది.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 400 ఇళ్లతో, 1607 జనాభాతో 1963 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 811, ఆడవారి సంఖ్య 796. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 140 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 572081[4].పిన్ కోడ్: 505327

విశేషాలు[మార్చు]

చుట్టుపక్కల 50 చ.కి.మీ. లోని 30 గ్రామాల ప్రజలకు జగిత్యాల వ్యాపార కేంద్రం. ఈ ప్రాంతపు ప్రజలకు ఇది విద్యాకేంద్రం కూడా. పట్టణానికి ఉత్తరాన జాఫరుద్దౌలా 1747లో కట్టించిన పాత కోట ఉంది. సమీప, దూర ప్రాంతాల పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలతో జగిత్యాలకు చక్కని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. పట్టణానికి రైలు మార్గం ఈ మధ్యనే నిర్మించారు.జగిత్యాల ఒక శాసనసభ నియోజకవర్గ కేంద్రము.

నిజాము పరిపాలన గుర్తుగా జగిత్యాలలో అప్పటి నిర్మాణాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇవి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. జగిత్యాల చుట్టుపక్కల ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వేములవాడ (56 కి.మీ), ధర్మపురి (27 కి.మీ), కొండగట్టు (15 కి.మీ) వీటిలో ప్రముఖమైనవి. ప్రముఖ చారిత్రక ప్రదేశమైన పొలాస (7కి.మీ ) (కాకతీయుల నాటి పౌలస్త్యేశ్వరపురం) జగిత్యాలకు చేరువలోనే ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

జగిత్యాల సమీపంలో కొండగట్టు వద్ద జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఉంది.పొలాస గ్రామములో ఆచార్య ఎన్. జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ( బి. యస్సీ అగ్రికల్చర్ ) ఉంది.డాక్టరు వి.ఆర్.కె. ఇంజనీరింగ్ కళాశాల ఉంది.పలు జూనియర్ కళాశాలలు ఉన్నాయి.గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 8 , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప బాలబడి జగిత్యాలలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల జగిత్యాలలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కరీంనగర్లోను, పాలీటెక్నిక్ పొలసలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జగిత్యాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కరీంనగర్ లోనూ ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

జగిత్యాల... Vaninager ఒక జెకమొక రాయిలాంటి పదం...అంటుకున్న ఎలగడ మంట లాంటి పదం...ఒక జనం మహల్...ఒక జంగిల్ మహల్... ప్రపంచ పటం మీద ఒక పచ్చబొట్టు...పోరాటాల పాదం మీద ఒక పుట్టుమచ్చ...రక్తమాంసాల స్థూపం మీద ఎగిరిన ఒక రగల్ జెండా...సామాన్యుడికి సామాన్యమైన పట్టణమే కావచ్చు...వ్యాపారులకు ఒక మంచి బిజినెస్ సెంటర్ కావొచ్చు...జ..గి..త్యా..ల...ఈ నాలుగు అక్షరాలలో నాలుగు దిక్కులు vaninger

పిక్కటిల్లిన ఆత్మఘోష ఉంది.సమరం ఉంది...సందేశం ఉంది...అంతకు మించి భిన్నమైన చరిత్ర ఉంది...పోరాట వీరులకు నెత్తురు పులకించిపోయే చారితాత్మక ప్రదేశం...జగిత్యాల అంటే ఒక జాగృతి జెండా...రష్యా గోడలమీద కూడా ఆనవాళ్ళు ముద్రించిన రుద్రభూమి...

 • పేరు వెనుక కథలు

జగిత్యాలకు vaninagerఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. క్రీ.శ. 1110 నుండి 1116 వరకు పొలాస రాజధానిగా పరిపాలించిన జగ్గదేవుడు, తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాల్ని స్థాపించాడు. పొలాసకు దక్షిణాన 6 కి.మీ. దూరంలో జగ్గదేవుడు అతని పేరిట జగ్గదేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాలగా స్థిరపడిందని చరిత్రకారులు కథనం. మరో కథనం ప్రకారం...ఎల్గందుల కోటకు అధిపతిగా ఉండిన మబారిజుల్ ముల్క్ జఫరుద్ధౌల మీర్జా ఇబ్రహీం ఖాన్ ధంసా క్రీ.శ.1747లో జగిత్యాలలో నక్షత్రాకారంలో ఒక సువిశాలమైన, పటిష్ఠమైన కోటను ఫ్రెంచ్ ఇంజనీర్లయి జాక్ సాంకేతిక సహకారంతో నిర్మించాడు. ఆ ఇద్దరి ఇంజనీర్ల పేరు మీదే ‘జాక్ పిలవబడి క్రమంగా జగ్త్యాల్, జగిత్యాలగా మారిందనీ చెబుతారు.

 • జగిత్యాల కోట

జగిత్యాల కోట రాయి, సున్నంతో నక్షత్రాకారంలో నిర్మితమైంది.[5][6] ఈ కోట చుట్టూ లోతైన కందకం ఉంది. ఇది ఇప్పటికీ నీటితో నిండి ఉంది. కోట నిర్మాణం కండ్లపల్లి చెరువు పక్కన జరిగింది, కనుక కందకంలో నీరు ఎప్పుడూ ఎండిపోదు. ఇది నిర్మించి దాదాపు 250 సంవత్సరాలు కావొస్తుంది. కోట బురుజులలో దాదాపు రెండు మీటర్ల పొడవైన తోపులు అనేకం ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ ఫిరంగులపై మహ్మద్ ఖాసిం పేరు ఉర్దూలో రాసి ఉంది. కోటలోపల, మందు గుండు సామాగ్రి కోసం నిర్మించిన గదులు అనేకం ఉన్నాయి. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవి. ఇక్కడ ఒక ఖిలేదార్, 200 మంది సిపాయిలు ఉండేవారు. ఆ కాలంలో అంటే క్రీ.శ. 1880లో జగిత్యాలలో 516 ఇళ్లు మాత్రమే ఉండేవంటారు. ఆనాటి జనాభా 2,812 అని తెలుస్తోంది.

చెక్కు చెదరని గడీ జగిత్యాల పట్టణంలో జువ్వాడి ధర్మజలపతి రావు అనే దొర ఒక గడీని నిర్మించాడు. ఈ గడీ చల్‌గల్ గడీకి దగ్గర పోలికల్తో ఉంటుంది. ఇరుపక్కల విశాలమైన బురుజులతో, లావైన స్తంభాలతో జగిత్యాల గడీ ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఈ గడీలో పై అంతస్థు పైన ఉండడానికి బయట నుండే రెండు వైపుల మెట్లను నిర్మించారు.ఆ కాలంలోని ‘దువ్వం తాలూకాదార్లు’ (డిప్యూటి కలెక్టర్‌లు) ఈ గడీలోనే ఉండేవారనీ చెబుతారు.

 • క్లాక్ టవర్‌

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1937లో తన పరిపాలనా రజతోత్సవాలను రాజ్యమంతటా జరిపించాడు. ఆ సందర్భంగా ధర్మజలపతి రావు జగిత్యాల నడిబొడ్డున ఎత్తయిన క్లాక్ టవర్‌ను నిర్మించాడు. అది చూసి మెచ్చుకొని, నిజాం రాజు ఆ క్లాక్ టవర్ వెండి నమూనాను చేయించి జ్ఞాపికగా ధర్మజలపతి రావుకు బహుకరించాడు. ఈ గడీని అమ్మివేయడంతో అది ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంది.

జగిత్యాల జైత్రయాత్ర[మార్చు]

జగిత్యాలకి ఇంతటి పేరు రావడానికి కారణం 1978 సెప్టెంబరు 9. ఆ రోజు విప్లవోద్యమానికి సంబంధించి చారిత్రాత్మకమైన ప్రస్తావనకు జగిత్యాల నాంది పలికింది. నలభై వేల మంది ప్రజలు భూస్వామ్య వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. అనాటి ‘జైత్రయాత్ర’లో ప్రముఖ మావోయిస్టు నాయకుడు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, శీలం నరేష్, లలిత, మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్‌జీ, మల్లా రాజిడ్డి, సాహు, నల్లా ఆదిరెడ్డి, కైరి గంగారాం, గజ్జెల గంగారాం, పోశాలు, అంగ ఓదెలు, నారదాసు లక్ష్మణ్‌రావు, గద్దర్, అల్లం నారాయణలతో పాటు పలువురు పాల్గొని తమ ప్రసంగాలతో ప్రజల్ని ఉత్తేజ పరిచారు. ఈ జైత్రయాత్ర రష్యా గోడలపైన కూడా నినాదమై చోటు సంపాదించుకుంది.

జగిత్యాల విశేషాలు[మార్చు]

ఒకప్పుడు చిన్న పట్టణంగా ఉండే జగిత్యాల నేడు చుట్టుపక్కల ఉన్న ఊర్లను ఎన్నింటినో తనలో కలుపుకొని ఒక ‘పెద్ద పట్టణం’గా రూపాంతరం చెందింది. జగిత్యాలలో ప్రస్తుతం సుమారు లక్షా యాబై వేల జనాభా ఉంది. తెలుగు, హిందీ, ఉర్దూ భాషలు సమాన స్థాయిలో పలుకుబడిలో ఉన్నాయి. ఇంగ్లీష్ కూడా క్రమంగా పరివ్యాప్తం చెందుతోంది. రాష్ట్రంలోని పెద్ద పట్టణాలలో ఇది ఒకటి. రాష్ర్ట ప్రభుత్వం ద్వారా ‘అతి పరిశుభ్రమైన నగరం’గా గుర్తింపు పొందింది.జగిత్యాలకు నాలుగు వైపుల నాలుగు చెరువులు ఉన్నాయి. కండ్లపల్లి, ముప్పారపు, మోతె చెరువుల నీళ్లని వ్యవసాయానికి, ధర్మసముద్రం నీటిని తాగేందుకు వినియోగిస్తున్నారు. మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్న జగిత్యాల జనాభాలో 51 శాతం పురుషుల, 49 శాతం మహిళలు ఉన్నారు. అక్షరాస్యత 63 శాతంగా నమోదైంది. ఇది జాతీయ రేటు (59.5 శాతం) కంటే ఎక్కువ.

ప్రాంతీయ వ్యవసాయ పరిశోదనా కేంద్రం[మార్చు]

ఉత్తర తెలంగాణ వాతావరణ మండలంలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల రైతులకు ఇది సేవలందిస్తోంది.రైతుల దేవాలయం...పొలాస వ్యవసాయ పరిశోధనాకార్యాలయం, ఆచార్య జయశంకర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 1980 డిసెంబర్ 2న జగిత్యాల మండలం పొలాస వద్ద పరిశోధనా క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో క్షేత్రం ఏర్పాటు కాగా, 1983 నుంచి పూర్తిస్థాయి కార్యక్రమాలు ఆరంభమయ్యాయి.

 • వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల,
 • 2008లో బిఎస్‌సి అగ్రికల్చర్ కాలేజీని ఏర్పాటు చేశారు.

పై మూడు జిల్లాల్లో ఏరువాక కేంద్రాలు, కృషీ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సేవలందిస్తున్నారు.

జగిత్యాల సాహిత్యం[మార్చు]

‘మరణం నా చివరి చరణం కాదు’ అని ప్రకటించుకున్న అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల మట్టిలో పుట్టిన మాణిక్యమే. ప్రభాకర్ గొప్ప చిత్రకారుడు కూడా. 21 ఏండ్ల వయస్సులో ‘ఎర్ర పావురాలు’ కవిత్వంతో సాహిత్యపు ప్రపంచంలో అడుగుపెట్టి 1979లో ‘మంటల జెండాలు’, 1981లో ‘చురకలు’, 1982లో హైదరాబాద్ చేరుకొని ‘రక్తరేఖ’, ‘సంక్షోభగీతం’, ‘సిటీలైఫ్’ మున్నగు సంపుటాలు వెలువరించారు.సామాజిక తత్వవేత్తగా, కథా రచయితగా, నవలా రచయితగా బి.ఎస్. రాములు సుప్రసిద్ధులు. విప్లవ దళిత, పౌరహక్కుల సంఘాల్లో భూమికను నిర్వహిస్తున్నారు.‘గతితార్కిక తత్వదర్శన భూమిక’ అనే గ్రంథాన్ని వెలువరించారు. వందకు పైగా కథలు, ఆరు నవలలు రాయటమే కాకుండా కథల బడి, కథా సాహిత్య అలంకార శాస్త్రం అనే గ్రంథాల్ని వెలువరించారు. అలాగే అమ్మ, యుద్ధం, బురదలో జాబిల్లి, నాన్న, నాతిచరామి, ఊరు, సిటీ, విభిన్న కథా సంపుటాలు, బేబి ఓ బేబి, నల్ల సముద్రం, అత్తారింటికి దారేది లాంటి నవలలు రాసిన కె.వి.నరేందర్ జగిత్యాలకు చెందినవారే. వలస కవిత్వంతో జీవితానుభవాలను రంగరిస్తున్న కవి సంగవేని రవీంద్ర అన్వేషణ, వర్లీనానీలు, లోలోన లాంటి కవితా సంపుటాలు వెలువరించారు. కె.వి.నరేందర్, సంగవేని రవీంద్రలు సంయుక్తంగా ‘తెలంగాణ గడీలు’ అనే చారిత్రాత్మక పుస్తకాన్ని కూడా వెలువరించారు.ఇంకా ఎనుగంటి వేణుగోపాల్ ‘గోపాలం కథలు’, ‘నాలుగు పుటలు’ కథా సంపుటాలు వెలువరించారు. పులి గోవర్థన్ ‘జెకమొక’ అనే కవితా సంపుటి తీసుకొచ్చారు.

చరిత్ర పరిశోధకుడు జైశెట్టి రమణయ్య జగిత్యాల చారిత్రాత్మక సంపదపై లోతైన పరిశోధనలు చేసిన చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య జగిత్యాల వాస్తవ్యులే. ఈయన రాసిన ‘టెంపుల్స్ ఆఫ్ సౌతిండియా’, ‘ది చాళుక్యాస్ అండ్ కాకతీయ టెంపుల్స్ ఎ స్టడీ’ అనే రెండు పుస్తకాలు జాతీయ స్థాయిలో పేరు సంపాదించి పెట్టాయి. యాబై చారిత్రాత్మక వ్యాసాలు ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితమై పాఠకుల మన్ననలు అందుకున్నాయి.

 • జగిత్యాలపై మూడు పుస్తకాలు

జగిత్యాలపై ఇప్పటి వరకు మూడు పుస్తకాలు వెలువడ్డాయి. అవి 1. జగిత్యాల జంగల్ మహల్ 2. జగిత్యాల పల్లె 3. నేను రుద్రవీణని... జగిత్యాలని. జగిత్యాల జైత్రయాత్ర జరిగిన తీరు, అంతకు ముందు దొరల వెట్టిచాకిరి, ఈ ప్రాంతం వెనుకబాటుతనం లాంటి విషయాల్ని విశ్లేషిస్తూ ‘జగిత్యాల జైత్రయాత్ర’ జరగడానికి కారణాలేమిటో చెబుతూ జగిత్యాల ‘జంగల్ మహల్’ పుస్తకం వెలువడింది. క్రాంతి ప్రచురణల పేరుతో విప్లవ రచయితల సంఘం 1981 జనవరిలో ఆరువేల కాపీలతో ఈ పుస్తకాన్ని ముద్రించారు.జగిత్యాల జైత్రయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రముఖ పాత్రికేయులు, నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ ‘జగిత్యాల పల్లె’ పేరుతో ముప్పయి కవితల సంకలనాల్ని వెలువరించారు. అల్లం నారాయణ రాసిన కవితలే కాకుండా పాటలు కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా *‘జగిత్యాల కదిలింది జంబాయిరే... ఊరూరు మండింది జంబాయిరే...’ అనే పాట ఇప్పటికీ పల్లె ప్రజల నాల్కలపై విన్పిస్తుంది.ఇక ‘నేను రుద్రవీణని...జగిత్యాలని’ శీర్షికన వచ్చిన పుస్తకం కె.వి.నరేందర్, సంగవేని రవీంద్ర రచించిన దీర్ఘ కవిత. జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యం, ఈ ప్రాంతంలో ప్రపంచీకరణ ప్రభావం వల్ల అస్తవ్యస్తమైన జీవన విధానాన్ని, ఫొటోలతో ప్రతిబింభిస్తూ ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్' పేరుతో ఒక విశిష్ట రూపంతో అల్లం నారాయణ కలం నుంచి వెలువడిన కవిత ఇది.

జగిత్యాల పల్లె పందిళ్లు విరుగుతయ్ బీరపాదులతో సహా సన్నీలు శరీరాల మీద దిగుతయ్ బట్టలు ఇగ్గేసీ బజారు పాలు చేస్తారు.ఎవడో ఒక అభాగ్యుడు పండ్లు గిలకరించి మూలుగుతడు.తెల్లవారుతుంది,అజ్ఞాత సూరీడు,విరిగిన, పగిలిన,చిరిగిన, చిట్లిన గుడిసె కప్పుల మీదుగా కిరణాలు ఝళిపిస్తూ తూర్పున రగుల్కొంటాడు...ఇదే జిల్లాకు చెందిన ప్రముఖ కవి , రచయిత వాసాల లక్ష్మినారాయణ జీవన గమనం , అక్షర సైన్యం ,అక్షర సమ్మేళనం అనే పుస్తకాలను వెలువరించాడు .

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

సమీప టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఏడుగురు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

జగిత్యాల (గ్రా)లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.

జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

జగిత్యాలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • అడవి: 95 హెక్టార్లు
 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 100 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 49 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 138 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 115 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 165 హెక్టార్లు
 • బంజరు భూమి: 655 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 646 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 908 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 558 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

జగిత్యాలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 94 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 249 హెక్టార్లు* చెరువులు: 215 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

జగిత్యాల (గ్రా)లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మొక్కజొన్న

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బీడీలు

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf
 2. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016. 
 3. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 25 July 2014. 
 4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011". 
 5. నమస్తే తెలంగాణ (14 October 2016). "చారిత్రక ఖిల్లా." Archived from the original on 17 July 2018. Retrieved 17 July 2018. 
 6. ఈనాడు. "జగిత్యాల ఖిల్లా". Archived from the original on 17 July 2018. Retrieved 17 July 2018. 

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జగిత్యాల&oldid=2469595" నుండి వెలికితీశారు