నారదాసు లక్ష్మణ్‌రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారదాసు లక్ష్మణ్‌రావు
నారదాసు లక్ష్మణ్‌రావు


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2008 - ప్రస్తుతం
నియోజకవర్గం కరీంనగర్

వ్యక్తిగత వివరాలు

జననం సెప్టెంబరు 15, 1955
మొగిలిపాలెం గ్రామం, తిమ్మాపూర్ మండలం , కరీంనగర్ జిల్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి వర్ష
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

నారదాసు లక్ష్మణ్‌రావు తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు. భారత్ రాష్ట్ర సమితి తరపున కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

నారదాసు లక్ష్మణ్‌రావు 1955, సెప్టెంబరు 15 తేదీన కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం , మొగిలిపాలెం గ్రామం గ్రామంలో కేశవ్ రావు, కమల బాయి దంపతులకు జన్మించాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఎ పొలిటికల్ సైన్స్ పూర్తిచేసి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి చదివాడు. కొంతకాలం న్యాయవాదిగా పనిచేశాడు.

వివాహం[మార్చు]

నారదాసు లక్ష్మణ్‌రావు 23 డిసెంబర్ 2016న నాంపల్లి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో హైకోర్టు న్యాయవాది అక్కి వర్షను వివాహమాడాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పిడిఎస్‌యు విద్యార్థి సంఘంలో పనిచేసి ఆర్‌ఎస్‌యులో చేరాడు. 1975లో ఎమర్జెన్సీ విధించడం ద్వారా అజ్ఞాతంలోకి వెళ్లి పీపుల్స్‌వార్ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 2001లో కేసీఆర్ టిఆర్‌ఎస్ పార్టీ స్థాపించిన తరువాత టిఆర్‌ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 2008, డిసెంబరు 18 నుంచి 2013, మార్చి 29 వరకు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా (కరీంనగర్, అదిలాబాద్, మెదక్, నిజామాబాద్) పనిచేశాడు. 2015లో కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా గెలిచాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 జూలై 2021. Retrieved 15 July 2021.
  2. Sakshi (23 December 2016). "టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రిజిష్టర్‌ మ్యారేజ్‌". Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.
  3. Chauhan, Ramesh (2015-12-07). "లైన్ క్లియర్." మన తెలంగాణ (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-08. Retrieved 2020-07-08.