అక్షాంశ రేఖాంశాలు: 18°21′35″N 79°05′15″E / 18.359739°N 79.087601°E / 18.359739; 79.087601

తిమ్మాపూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిమ్మాపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°21′35″N 79°05′15″E / 18.359739°N 79.087601°E / 18.359739; 79.087601
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండల కేంద్రం తిమ్మాపూర్ (కరీంనగర్)
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 158 km² (61 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 49,026
 - పురుషులు 24,149
 - స్త్రీలు 24,877
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.14%
 - పురుషులు 64.90%
 - స్త్రీలు 41.32%
పిన్‌కోడ్ {{{pincode}}}

తిమ్మాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని మండలం.[1]ఈ మండలం పరిధిలో 14 గ్రామాలు కలవు.[2] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. మండల కేంద్రం తిమ్మాపూర్.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం తిమ్మాపూర్ మండలం మొత్తం జనాభా 49,026. వీరిలో 24,149 మంది పురుషులు కాగా, 24,877 మంది మహిళలు ఉన్నారు. మండలంలో మొత్తం 13,176 కుటుంబాలు నివాసం ఉన్నాయి. మండలం సగటు లింగ నిష్పత్తి 1,030.మొత్తం జనాభాలో 12.6% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 87.4% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 67.2% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 59%గా ఉంది. అలాగే మండలంలో పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 998 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 1,035గా ఉంది. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4316, ఇది మొత్తం జనాభాలో 9%. 0-6 సంవత్సరాల మధ్య 2213 మంది మగ పిల్లలు, 2103 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 950, ఇది తిమ్మాపూర్ మండల సగటు లింగ నిష్పత్తి (1,030) కంటే తక్కువ.మొత్తం అక్షరాస్యత శాతం 60%. పురుషుల అక్షరాస్యత రేటు 63.52%, స్త్రీల అక్షరాస్యత రేటు 46.17%.[4]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 158 చ.కి.మీ. కాగా, జనాభా 49,026. జనాభాలో పురుషులు 24,149 కాగా, స్త్రీల సంఖ్య 24,877. మండలంలో 13,176 గృహాలున్నాయి.[5]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. వచ్చునూర్
  2. తిమ్మాపూర్
  3. అలుగునూర్
  4. పోరండ్ల
  5. మన్నెన్‌పల్లి
  6. నుస్తులాపూర్
  7. నేదునూర్
  8. రేణికుంట
  9. కొత్తపల్లి (పి.ఎన్)
  10. నల్లగొండ
  11. మల్లాపూర్
  12. పోలంపల్లి
  13. పార్లపల్లి
  14. మొగిలిపాలెం

మూలాలు

[మార్చు]
  1. http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  4. "Timmapur Mandal Population, Religion, Caste Karimnagar district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-07-25. Retrieved 2022-07-25.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

[మార్చు]