Jump to content

రామడుగు మండలం

Coordinates: 18°37′15″N 79°05′16″E / 18.62087°N 79.087715°E / 18.62087; 79.087715
వికీపీడియా నుండి
రామడుగు
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, రామడుగు స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, రామడుగు స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, రామడుగు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°37′15″N 79°05′16″E / 18.62087°N 79.087715°E / 18.62087; 79.087715
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండల కేంద్రం రామడుగు (కరీంనగర్)
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 134 km² (51.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 48,253
 - పురుషులు 23,985
 - స్త్రీలు 24,268
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.89%
 - పురుషులు 67.25%
 - స్త్రీలు 40.53%
పిన్‌కోడ్ 505531

రామడుగు మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా లోని మండలం. ఈ మండలం పరిధిలో 19 గ్రామాలు కలవు.[1] అందులో ఒకటి నిర్జన గ్రామం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. మండల కేంద్రం రామడుగు.

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 48,253- పురుషులు 23,985 - స్త్రీలు 24,268

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 134 చ.కి.మీ. కాగా, జనాభా 48,253. జనాభాలో పురుషులు 23,985 కాగా, స్త్రీల సంఖ్య 24,268. మండలంలో 12,340 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. తిర్మలాపూర్
  2. శ్రీరాములపల్లి
  3. చిప్పకుర్తి
  4. గుండి
  5. లక్ష్మీపూర్
  6. దాతోజీపేట్
  7. రామడుగు
  8. షానగర్
  9. గోపాల్‌రావుపేట్
  10. కోరట్‌పల్లి
  11. రుద్రారం
  12. మోతే
  13. కిస్టాపూర్
  14. వెదిర
  15. వెలిచల్
  16. దేశ్‌రాజ్‌పల్లి
  17. కొక్కెరకుంట
  18. వన్నారం

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మండల ప్రముఖులు

[మార్చు]
  • సంటి అనిల్ కుమార్: ఈ మండలానికి చెందిన శ్రీరాములపల్లి గ్రామ నివాసి. వీరు ప్రముఖ యువ కవి, రచయిత మరియు సాహిత్య నిర్వాహకులు. 2012లో 'కొత్తచిగుళ్లు' కవితా సంపుటిని వెలువరించారు. 2019 కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార ఎంపిక ప్రక్రియలో తెలుగు విభాగం నుండి తుది జాబితా (Shortlist) లో నిలిచిన అతికొద్ది మందిలో వీరు ఒకరు. వీరు "సాహితి సవ్వడి" అనే సాహిత్య వేదిక ద్వారా తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
  2. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]