Jump to content

భూపాలపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 18°25′53″N 79°51′38″E / 18.4314°N 79.8605°E / 18.4314; 79.8605
వికీపీడియా నుండి
  ?భూపాలపల్లి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°25′53″N 79°51′38″E / 18.4314°N 79.8605°E / 18.4314; 79.8605
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 52.62 కి.మీ² (20 చ.మై)[1]
జిల్లా (లు) వరంగల్ జిల్లా
జనాభా
జనసాంద్రత
42,387[2] (2011 నాటికి)
• 806/కి.మీ² (2,088/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం భూపాలపల్లి పురపాలకసంఘం


భూపాలపల్లి, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ జిల్లా, భూపాలపల్లి మండలానికి చెందిన మునిసిపల్ పట్టణం.[3] ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు పరిపాలనా కెేంద్రం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[4]

కొత్త జిల్లా పరిపాలనా కేంద్రంగా మార్పు.

[మార్చు]

లోగడ "భూపాలపల్లి" వరంగల్ జిల్లాలో, ఒక రెవెన్యూ డివిజనుగా, మండలంగా ఉండేది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లాకు చెందిన 16 మండలాలు, కరీంనగర్ జిల్లాలకు చెందిన 5 మండలాలు కలిపి (1+20) ఇరవైఒక్క మండలాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరుతో నూతన జిల్లాగా ప్రకటించి, జిల్లా పరిపాలనా కేంద్రంగా భూపాలపల్లి ఉండేలాగున ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5]

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం

[మార్చు]

జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రంలోని మంజూర్‌నగర్‌ వద్ద 59 కోట్ల 42 లక్షల రూపాయలతో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పైన రెండు అంతస్తులు ఉండేలా ఈ సమీకృత జిల్లా కార్యాలయం నిర్మించబడింది. 33 కార్యాలయాలతో నిర్మించిన ఈ సముదాయం కింది అంతస్తులో కలెక్టర్‌, అడిషనల్ కలెక్టర్ల కార్యాలయాలు, రెండు వెయిటింగ్‌ హాల్స్‌, రెండు వీడియోకాన్ఫరెన్స్‌ హాల్స్‌, అధికారుల సహాయకులకు రెండు ప్రత్యేక గదులు, దాదాపు 300 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా సువిశాల కాన్ఫరెన్స్‌ హాల్‌ను నిర్మించారు. రికార్డు రూమ్‌, స్ట్రాంగ్‌ రూమ్‌, సెంట్రల్‌ కోర్టు యార్డు, ఫౌంటేన్‌తో పాటు ఆయా శాఖల అధికారులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. భవనానికి వెనుక వైపు రెండు హెలిప్యాడ్లను ఏర్పాటుచేశారు.[6]

ఈ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలను 2023, అక్టోబరు 9న రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్‌కు పోలీసులు గౌరవవందనం సమర్పించారు. ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించాడు. నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కలెక్టర్ భవేష్‌మిశ్రాను కుర్చీలో కుర్చోబెట్టి, పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యాక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[7]

పౌర పరిపాలన

[మార్చు]

భూపాలపల్లి నగర పంచాయతీగా 2012 లో ఏర్పడింది. ఈ పట్టణం అధికార పరిధి 52.62 కి.మీ2 (20.32 చ. మై.).[1]

పట్జణ జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా  - మొత్తం 86,729 - పురుషులు 43,855 - స్త్రీలు 42,874.

శాసనసభ నియోజకవర్గం

[మార్చు]

అభివృద్ధి పనులు

[మార్చు]
  • 2022 మే 9: జిల్లా కేంద్రంలో 55 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 200 పడకల ఆస్ప‌త్రి, 50 పడకల ఆయుష్‌ దవాఖాన, 6 కోట్ల‌ రూపాయలతో ఏర్పాటు చేయనున్న రేడియోల‌జీ, పాథాల‌జీ ల్యాబ్స్‌లకు 2022 మే 9న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు శంకుస్థాపన చేశాడు. 100 పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్‌, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[8]
  • 2023 ఫిబ్రవరి 23: పట్టణంలోని మంజునగర్ ప్రాంతంలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ ఆధితి గృహాన్ని, 23 లక్షల రూపాయలతో నిర్మించిన దివ్యాంగుల భవనాన్ని, వేశాలపల్లి వద్ద 33.08 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 544 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 14.59 లక్షలతో నిర్మించిన వీధి వ్యాపారుల సముదాయం, సింగరేణి సంస్థ 229 కోట్ల రూపాయలతో నిర్మించిన 994 డబుల్ బెడ్ రూమ్ క్వార్టర్ల సముదాయాన్ని (రామప్ప కాలనీ) తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించాడు. అలాగే జిల్లాకేంద్రంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సింగరేణి మినీ స్టేడియం, కోటి రూపాయలతో నిర్మించనున్న జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన చారి, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర్ లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.[9]

ప్రభుత్వ వైద్య కళాశాల

[మార్చు]

భూపాలపల్లి పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం 2023లో భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటుచేసింది. 2023 సెస్టెంబరు 15న ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు.[10][11]

జిల్లా పోలీసు కార్యాలయం

[మార్చు]

జిల్లా కేంద్రంలో 37 కోట్ల రూపాయలతో 37 ఏకరాల స్థలంలో, 50,263 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయం కార్యాలయంలో ఎస్పీ, ఏఎస్పీ, ఓఎ‌స్‌‌డీ‌లకు ప్రత్యేక గదు‌ల‌తో‌పాటు రెస్ట్‌ రూంలు, నేరా‌లను ఛేదిం‌చేలా క్రైం విభాగం, పరి‌పా‌లనా విభా‌గా‌లు, ఇంటె‌లి‌జెన్స్‌, డాగ్‌ స్క్వాడ్‌, డిజి‌టల్‌ ల్యాబ్‌లు, ట్రైనింగ్‌ హాల్‌, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, ఐటీ కోర్‌, ఫింగర్‌ ప్రింట్స్‌, సైబర్‌ ల్యాబ్‌, పీడీ సెల్‌, నాలుగు సెమినార్ హాళ్ళు, ఇన్‌‌వార్డు, ఔట్‌‌వార్డు, మినీ కాన్ఫ‌రె‌న్స్‌‌హాల్‌, పరేడ్‌ గ్రౌండ్‌, పార్కు, శాశ్వత హెలిప్యాడ్‌ ఏర్పాటుచేయబడ్డాయి.[12]

జిల్లా పోలీసు కార్యాలయాన్ని 2023, అక్టోబరు 9న మంత్రి కేటీఆర్ ప్రారంభించాడు. జిల్లా పోలీసు కార్యాలయంలో కేటీఆర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యాలయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించాడు. నూతన కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ ని కుర్చీలో కూర్చోబెట్టి, పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపాడు.

డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు

[మార్చు]

పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా కేటీకే-5 ఇైంక్లెన్‌ సమీపంలో ప్రభుత్వం రెండో విడుత 22.04 కోట్ల రూపాయలతో నిర్మించిన 416 డబుల్‌ బెడ్రూం ఇళ్ళను 2023 అక్టోబరు 9న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించి, లబ్ధిదారులకు అందించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 June 2016. Retrieved 28 June 2016.
  2. "Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards - Population Statistics in Maps and Charts".
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-23.
  6. telugu, NT News (2023-10-09). "ప్రగతి పండుగకు సర్వం సిద్ధం". www.ntnews.com. Archived from the original on 2023-10-09. Retrieved 2023-10-09.
  7. "TS: భూపాలపల్లి సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Prabha News. 2023-10-09. Archived from the original on 2023-10-09. Retrieved 2023-10-09.
  8. telugu, NT News (2022-05-09). "సిజేరియ‌న్లు చేయిస్తే దేవుడు కూడా వ‌ర‌మివ్వ‌డు : మంత్రి హ‌రీశ్ రావు". Namasthe Telangana. Archived from the original on 2022-05-09. Retrieved 2022-05-09.
  9. telugu, NT News (2023-02-23). "Minister KTR | జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్‌ సుడిగాలి పర్యటన". www.ntnews.com. Archived from the original on 2023-02-25. Retrieved 2023-02-25.
  10. "KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్‌ కళాశాలలు ప్రారంభం". EENADU. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-27.
  11. telugu, NT News (2023-09-15). "CM KCR | ఒకేసారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం.. సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఘ‌ట్టం ఇది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-27.
  12. "సకల వసతులు.. కార్పొరేట్‌ హంగులు". EENADU. 2023-08-09. Archived from the original on 2023-08-09. Retrieved 2023-10-09.

బయటి లింకులు

[మార్చు]