సిరికొండ మధుసూధనాచారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిరికొండ మధుసూధనాచారి

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్
పదవీ కాలము
2014 - ప్రస్తుతం
నియోజకవర్గము భూపాలపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం (1956-10-13) 1956 అక్టోబరు 13
నరసక్కపల్లి,పరకాల,వరంగల్లు జిల్లా
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
మతం హిందూ
జూన్ 14, 2014నాటికి

సిరికొండ మధుసూధనాచారి తెలంగాణా రాష్త్ర తొలి శాసనసభ స్పీకర్. ఆయన వరంగల్‌లు జిల్లా, పరకాల మండలం నరసక్కపల్లిలో 1956 అక్టోబరు 13 న జన్మించారు. ప్రాథమిక విద్యను స్వస్థలంలోనే పూర్తి చేసిన అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ (ఇంగ్లీష్‌) పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. మధుసూధనాచారికి భార్య ఉమాదేవి, కుమారులు ప్రదీప్‌, ప్రశాంత్‌, క్రాంతి ఉన్నారు. 2014 సాధారణ ఎన్నికలలో వరంగల్‌ జిల్లా భూపాలపల్లి అసెంబ్లీ నియోజ వర్గం నుంచి టిఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌పై ఎన్నికైనారు.

రాజకీయ జీవితం[మార్చు]

స్వర్గీయ ఎన్టీఆర్‌ పిలుపుతో సిరికొండ మధుసూధనాచారి 1982లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి 1994-99 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికై తొలి సారిగా చట్టసభలో ప్రవేశించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం అవుతున్న సమయంలో కేసీఆర్‌కు దగ్గరయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపనకు 8 నెలల ముందు నుండే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో చారి పాత్ర పోషించారు. టీఆర్‌ఎస్‌ పోలిట్‌బ్యూరో సభ్యుడు. 1994లో అసెంబ్లీకి మొదటి సారిగా ఎన్నికై వచ్చే సమయం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీన్ని చూసి చలించి పోయిన మధుసూధనాచారి పత్తిరైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు పురుగుల మందును సభలోకి తెచ్చారు. 2014 సాధారణ ఎన్నికలలో వరంగల్‌ జిల్లా భూపాలపల్లి నుంచి టిఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌పై ఎన్నికైనారు.[1] 2018 ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం నుండి ఓడిపోయారు.

వనరులు[మార్చు]

  1. http://www.suryaa.com/main/features/weeklySpecials.asp?Category=0&ContentId=184268[permanent dead link]