ఎర్రబెల్లి దయాకర్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్రబెల్లి దయాకర్ రావు
నియోజకవర్గము వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం

వరంగల్ లోకసభ నియోజకవర్గం పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం


ముద్దు పేరు దయన్న

వ్యక్తిగత వివరాలు

జననం (1956-07-04) 1956 జూలై 4 (వయస్సు: 63  సంవత్సరాలు)
పర్వతగిరి పర్వతగిరి వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం

 India ఇండియా పిన్ కోడ్ 506369
సెల్: 98480 12459.

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ గతం, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు జగన్నాధరావు , ఆదిలక్ష్మీ
జీవిత భాగస్వామి ఉషారాణి
సంతానము ఒక కుమారుడు{ప్రేమ్ చందర్ రావు,మహతి(కోడలు)} ఒక కుమార్తె {ప్రతిమారావు,మధన్ మోహన్ రావు(అల్లుడు)
నివాసము వరంగల్
మతం హిందూ మతము

ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లాకు చెందిన ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన సీనీయర్ రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన తొలి తెలంగాణ శాసనసభ 2018 లో ఎన్నిక ఆరవ సారి ఎమ్మెల్యే గెలిచిన తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లో మొదటి పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి,నీటి సరఫరా శాఖ,ల రాష్ట్ర మంత్రి.

బాల్యం, కుటుంబం[మార్చు]

ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్లు గ్రామీణ జిల్లాకు చెందిన పర్వతగిరిలో జన్మించాడు. ప్రముఖ రాజకీయ కుటుంబం నుండి వచ్చాడు. 1964లో ఇతని తండ్రి సమితి అధ్యక్షుడుగా పనిచేశాడు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి స్వర్గీయ కీ.శే. శ్రీ నెమురుగోమ్ముల యెతిరాజారావు గార్కి బంధువు, రాజకీయ శిష్యుడు .

విద్యాభ్యాసం[మార్చు]

ఇంటర్మీడీయట్ వరకు అభ్యసించి, వరంగల్లో తండ్రి మిత్రుడు అయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ ఇంట్లో ఉంటూ డిగ్రీ మధ్యలోనే ఎన్.టి.రామారావు అభిమాన సంఘం నాయకుడుగా పనిచేసిన పరిచయంతో, ఎన్టీ రామారావు సూచనపై చదువు ఆపేసి, రాజకీయాలలో ప్రవేశించి, 1982లోనే తెలుగుదేశం పార్టీలో చేరారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో 20 వేల మందితో వరంగల్లో సమావేశం ఏర్పాటు చేసి సభకు అధ్యక్షత వహించారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఎర్రబెల్లి దయాకర్ రావు 1983లో తొలిసారి శాసన సభ్యులుగా పోటీచేసి ఓడిపోయారు. 1987లో వరంగల్ డిసిసిబి అధ్యక్షునిగా పదవి లభించింది. వరంగల్ జిల్లాకు రేషన్ డీలర్స్ గౌరవ అధ్యక్షులుగా పనిచేసారు.

రాజకీయ జీవితం[మార్చు]

1994లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో 3 వరస విజయాలతో హాట్రిక్ సాధించారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాడు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక 2008 ఉప ఎన్నికలలో కూడా వరంగల్ ఎంపీగా సిట్టింగ్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రవీంద్ర నాయక్ ను ఓడించి, తెలుగుదేశం ఎంపీగా విజయం సాధించారు. మొత్తం 3 సార్లు శాసన సభ్యులుగా వర్ధన్నపేట నుండి ఎన్నిక కావడమే కాకుండా, 2009,2014, 2018 లో పాలకుర్తి నుంచి వరసగా 4 వ సారి, 6 వసారి డా.నెమురుగోమ్ముల సుధాకర్ రావు సహకారంతో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులైనారు. 2014లో దుగ్యాల శ్రీనివాస రావు పై,2018 లో జంగ రాఘవ రెడ్డి పై 53,009 మెజారిటితో గెలుపొంది పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 4, 5, 6,వసారి శాసనసభలో ప్రవేశించారు,డబుల్ హాట్రిక్ {ఆరు సార్లు విజయం} సాదించిన బహుకొద్ది మంది శాసన సభ్యుల్లో ఒక్కరు[1].

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి[మార్చు]

సమైక్యవాది నారా చంద్రబాబునాయుడుతో సహా యనమల రామకృష్ణుడు లాంటి నాయకులను, శాసనసభ సభ్యులను ఒప్పించి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విభజనకు తెలుగుదేశం పార్టీ నుండి 2 సార్లు అనుకూలంగా లేఖ ఇప్పించేందుకు కృషి చేసాడు. తెలంగాణ ప్రాంతంలో తెదేపా తరఫున ప్రముఖ నాయకుడిగా చెలామణి అయ్యాడు. ఇతని దూకుడు స్వభావం వలన మీడియా లోను ప్రముఖునిగా పేరు పొందాడు.

బాబ్లీ ప్రాజెక్టు[మార్చు]

ప్రాణహిత నదిపై బాబ్లీ ప్రాజెక్టు కడితే మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదికి కేవలం 6 నుండి 8 టీ.యం.సి. ల నీరు ఆగుతుంది. జైలుకు సైతం వెళ్లాడు తెలంగాణ ఎడారి అవుతుంది అని బాబ్లీ ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్ళి నిరసన చేశాడు. తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడుతో కలిసి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు కట్టే ప్రాంతానికి వెళ్లాడు. అందరినీ మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి విమానంలో హైదరాబాదుకు పంపారు.

నియోజకవర్గ అభివృద్ధి[మార్చు]

పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కొద్ది గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ తో మంచినీరు ప్లాంట్లు పెట్టారు. వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువను తెచ్చారు, గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ తో మంచినీరు ప్లాంట్లు పెట్టారు. చేసిన పనుల వలన డబుల్ హాట్రిక్ {ఆరు సార్లు విజయం} సాదించిన బహుకొద్ది మంది శాసన సభ్యుల్లో ఒక్కరుగా రికార్డు ఉంది.

రాష్ట్ర ప్రముఖ నాయకుడు[మార్చు]

2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో నారా చంద్రబాబునాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. ఎనుముల రేవంత్ రెడ్డి శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ శాసన సభ్యులు స్టీఫెన్ కు డబ్బులు పంపిణీ చేస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

టీఆర్‌ఎస్ లో చేరారు[మార్చు]

దయాకర్ రావు 2016లో తెలుగుదేశం పార్టీని వదలి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (తెరాస) టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు[2].[3].

2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా ఉన్నారు.[4][5][6]


మూలాలు[మార్చు]

  1. https://epaper.sakshi.com/1933680/Jangaon-District/12-12-2018#page/2/2
  2. https://www.youtube.com/watch?v=qjoiG4wzq_g
  3. http://v6news.tv/highlights-of-finance-minister-arun-jaitleys-union-budget-2016-teenmaar-news
  4. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." మూలం నుండి 24 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 July 2019. Cite news requires |newspaper= (help)
  5. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". మూలం నుండి 24 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 July 2019. Cite news requires |newspaper= (help)
  6. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". మూలం నుండి 24 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 July 2019. Cite news requires |newspaper= (help)