నెమురుగోమ్ముల సుధాకర్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెమురుగోమ్ముల సుధాకర్ రావు

నియోజకవర్గం పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ టీఆర్ఎస్
నివాసం వడ్డెకొత్తపల్లి కొడకండ్ల వరంగల్ జిల్లా

నెమురుగోమ్ముల సుధాకర్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. నెమురుగోమ్ముల యెతిరాజారావు, నెమురుగోమ్ముల విమలాదేవి కుమారుడు.

సేవలు[మార్చు]

నెమురుగోమ్ముల డా: సుధాకర్ రావు పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం శాసనసభ్యులుగా 1999 నుండి 2004 వరకు ప్రాతినిధ్యం వహించాడు. 1969 లో విద్యార్థిగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి, జనగామలో అరెస్టు అయ్యాడు. తెలంగాణ కోసం 2010 తర్వాత అతను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.డాక్టర్ గా 1975 నుండి సామాన్య జనానికి వైద్యసేవలందించాడు.

శాసనసభ్యునిగా[మార్చు]

శాసనసభ్యునిగా అతను తన నియోజకవర్గంలో అనేక గ్రామాలకు తారు రోడ్లు వేయిచాడు. చిన్న గ్రామాలకు మట్టి, మెటల్ రోడ్లను వేసి రవాణా వసతి కల్పించాడు. అతను ముఖ్యమైన రోడ్లకు జన్మభూమి, జడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి నిధులతో సి.సి. రోడ్లు వేయించాడు. అనేక మంది నిరుపేదలకు శాశ్వత గృహావసతులు కల్పించాడు.అతని నియోజకవర్గంలో సుమారు 35 ఒవర్ హెడ్ ట్యాంకులు ప్రభుత్వ సహకారంతో నిర్మించాడు.నియోజకవర్గంలో చేసిన పనులలో ముఖ్యమైంది శ్రీరాంసాగర్ కాలువ మైలారం రిజ్వర్వాయర్ నుండి ఒక 1 కి.మీ. కు 1 కోటి 50 లక్షలతో, 35 కి.మీ.లు పాలకుర్తి నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం. దీనివలన (ఏడునూతుల) కొడకండ్ల రిజ్వర్వాయర్, మరి కొన్ని చెరువులు నింపడానికి ఉపయోగపడింది.

యం.యల్.ఎ గా ఓటమి[మార్చు]

2014 సుధాకర్ రావు ఓటమి చెందాడు. టి.ఆర్.ఎస్. యం.యల్.ఎగా 2004లో దుగ్యాల శ్రీనివాసరావు గెలిచాడు. 2014లో తెలంగాణగా రాష్ట్రం విడిపోయింది. యం.యల్.ఎగా 2014 పోటీలో ఎర్రబెల్లి దయాకర్ రావు గెలిచాడు. శ్రీనివాసరావు, సుధాకర్ రావు ఓటమిచెందారు. పోటీలో 3వ స్ధానం లోకి పడిపోయాడు సుధాకర్ రావు .కానీ తెలంగాణలో టి.ఆర్‌.ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]