నెమురుగోమ్ముల విమలాదేవి
నెమురుగోమ్ముల విమలాదేవి | |
---|---|
భాగస్వామి | నెమురుగోమ్ముల యెతిరాజారావు |
పురస్కారాలు | MLA 1967-72 |
నెమురుగోమ్ముల విమలాదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ (1967) లో చెన్నూరు శాసనసభ నుండి ఎన్నికైన శాసన సభ్యురాలు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఈమె భర్త వడ్డేకొత్తపల్లి, కొడకండ్లకు చెందిన మాజీ శాసనసభ్యులు నెమురుగోమ్ముల యెతిరాజారావు.
నెమురుగోమ్ముల యెతిరాజారావు 1962లో శాసన సభ్యునిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాములు (వడ్డేకొత్తపల్లి) పై గెలిచాడు. దాంతో కాంగ్రేస్ పార్టీలో ఉండి స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి నందుకు 6 ఏండ్లు కాంగ్రేస్ పార్టీ యెతిరాజారావును బహిష్కిరింది. ఆయన 1962 నుండి 1967 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసన సభ్యులుగా పనిచేసాడు. 1967 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ బహిష్కిరింది. ఇంకా 1 సంవత్సర కాలం ఉంది టిక్కెట్ ఇవ్వలేం అన్నారు. యెతిరాజారావు కి, కాని మీరు సూచించిన వారికి ఇస్తామన్నారు. ఆయన ముఖ్య అనుచరులైన ఇమ్మడి లక్ష్మయ్య లేదా శ్రీరాం అప్పయ్య లలో ఒకరికి టికెట్ యిస్తారని చాలా మంది భావించారు. కాని ఊహించని విధంగా ఆయన భార్య నెమురుగోమ్ముల విమలాదేవి కి టిక్కెట్ ఇప్పించాడు.
శాసనసభ్యురాలిగా
[మార్చు]ఆ ఎన్నికలలో పోటీ చేసిన నెమురుగోమ్ముల విమలాదేవి ప్రత్యర్థి అయిన కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి నల్ల నర్శింహులు పై గెలుపొందారు. 1967 నుండి 1972 వరకు శాసన సభ్యులుగా పనిచేసారు.
విమలాదేవి చరిత్ర
[మార్చు]నెమురుగోమ్ముల విమలాదేవి.1972 లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ యెతిరాజారావు కి ఇవ్వలేదు ఇందిరాగాంది. ఆడవారు MLA అభ్యర్ధి విమలాదేవి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక్కరే. విమలాదేవి కి కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ ఇందిరాగాంది పట్టుపట్టి విమలాదేవి కి ఇచ్చింది. విమలాదేవి ని ఓడించి కుందూర్ మదుసూదన్ రెడ్డి గెలిచాడు. మదుసూదన్ రెడ్డి ఓ కరపత్రం తీసి విమలాదేవి పై లేనిపోని ఆరోపనలు చేసి గెలిచాడు అని యెతిరాజారావు (శివశంకర్ లాయర్) హైకోర్టు వెళ్లాడు.ఈ కేసును హైకోర్టు కొట్టేసింది. యెతిరాజారావు ముఖ్య అనుచరుడు అప్పటికి ఇమ్మడి లక్ష్మయ్య (నాంచారిమడూర్,తోర్రూర్) ప్రోచ్చాహంతో సుప్రీంకోర్టు వెళ్లాడు, సుప్రీంకోర్టు లోఅప్పిల్ వేశాడు యెతిరాజారావూ . 1975లో సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975లో చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. ఆ తరువాత నెమురుగోమ్ముల యెతిరాజారావూ MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన్నాడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "etelangana.org లో ఎన్నిక వివరాలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-05-07.