దుగ్యాల శ్రీనివాస రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుగ్యాల శ్రీనివాస రావు
నివాసంగ్రామం : నల్లబెల్లి (వర్ధన్నపేట) మండలం : వర్ధన్నపేట జిల్లా : వరంగల్ .
జాతీయతభారతీయుడు
చదువుBAMS
యజమానిఆయుర్వేద డాక్టర్
రాజకీయ పార్టీకాంగ్రేస్ పార్టీ
భాగస్వామిసుమన

దుగ్యాల శ్రీనివాస రావు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభా సభ్యునిగా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన సేవలనందించారు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన వరంగల్ జిల్లా లోణి వర్ధన్నపేట మండలానికి చెందిన నల్లబెల్లి గ్రామంలో జన్మించాడు. వరంగల్లో BAMS ఆయుర్వేద డాక్టర్ చదివాడు. ఈయన భార్య సుమన.

కాంట్రాక్టర్‌గా[మార్చు]

BAMS ఆయుర్వేద డాక్టర్ వృత్తి అయిన కాంట్రాక్టర్ గా ప్రభుత్వ లైసెన్స్ పొంది R&B పనులు చేస్తూండే వాడు.

శాసనసభ్యునిగా[మార్చు]

అప్పటి చెన్నూర్ ఇప్పటి పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలో నెమురుగోమ్ముల యెతిరాజారావు గారి కుటుంబ సభ్యులు 1962- 2004 వరకు MLAలుగా గెలిచారు. పాలకుర్తి నియోజక వర్గం 2004 వరకు చెన్నూరు నియోజకవర్గంలో ఉండేది. చెన్నూరు సెగ్మెంట్ లో పాలకుర్తి, కొడకండ్ల, తోర్రూరు, నర్సింహులపేట, నెల్లికుదురు మండలాలుండేవి. 2009 డీలిమిటేషన్ లో చెన్నూరు నుంచి విడిపోయి.. పాలకుర్తి సెగ్మెంట్ గా ఏర్పడింది. తొర్రూర్, కొడకండ్ల, పాలకుర్తి మండలాలతోపాటు వర్థన్నపేట నియోజకవర్గంలోని రాయపర్తి, జనగామలోని దేవరుప్పల మండలాలు ఇందులో కలిసిపోయాయి. పాలకుర్తిలో ఉన్న నర్సింహులపేటను డోర్నకల్ లో… నెల్లికుదురును మహబూబాబాద్ లో కలిపారు.

పాలకుర్తి నియోజక వర్గంలో ఐదు మండలాలున్నాయి. నెమురుగోమ్ముల సుధాకర్ రావు సొంత తమ్ముడు శ్రీ నెమురుగోమ్ముల ప్రవీణ్ రావు గారి మద్దతుతో MLA గా శ్రీనివాస రావు గెలిచారు.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]