ఎల్.రమణ
Appearance
ఎల్.రమణ | |||
| |||
ఎమ్మెల్సీ
| |||
పదవీ కాలం 5 జనవరి 2022 – 2028 | |||
నియోజకవర్గం | కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా | ||
---|---|---|---|
మాజీ మంత్రి & శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 2009 – మార్చి 2014 | |||
నియోజకవర్గం | జగిత్యాల | ||
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2015 - 9 జులై 2021 | |||
నియోజకవర్గం | తెలంగాణ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జగిత్యాల, కరీంనగర్, తెలంగాణ | 1961 సెప్టెంబరు 4||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | సంధ్య (m. invalid year) | ||
సంతానం | ఎల్.మణికంఠ , ఎల్.కార్తికేయ | ||
నివాసం | జగిత్యాల, హైదరాబాదు |
ఎల్.రమణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలంగాణ శాసనమండలి సభ్యుడు. ఆయన 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ‘స్థానిక సంస్థల’ కోటా టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఎల్.రమణ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో 1961 సెప్టెంబరు 4న జన్మించాడు.[2] అతను గంగారాం కుమారుడు.[3] అతను ఎస్.కె.ఎన్.ఆర్ కళాశాలలో బియస్సీ (1978–81) చదివాడు. అతను వృత్తిరీత్యా రాజకీయనాయకుడు, సమాజ సేవకుడు. అతను 1990 ఆగస్టు 8న సంధ్యను వివాహమాడాడు. అతనికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడైన డా. ఎల్.మణికంఠ కామినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో ఎం.బి.బి.ఎస్ చదువుతున్నాడు. చిన్న కుమారుడు ఎల్. కార్తికేయ అమితీ విశ్వవిద్యాలయం నుండి బి.బి.ఎ చదువుతున్నాడు.
వివిధ పదవులు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు (2009-2014)
- ఎ.పి.ఖాదీ గ్రామ పారిశ్రామిక బోర్డు చైర్మన్
- పార్లమెంటు సభ్యుడు, 11వ లోక్‌సభ - 1996-98
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు - 1994-96
- హాండ్లూం, టెక్స్‌టైల్స్ మంత్రి - 1994-96
- తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - 9 జూలై 2021 [4]
- 12 జూలై 2021న టీఆర్‌ఎస్ పార్టీ సభ్యతం తీసుకున్నాడు.[5]
- ఆయన 16 జూలై 2021న తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. ఆయనకు కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు.[6]
- ఎల్. రమణ 2021 డిసెంబరు 10లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా -1 స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా 2021 డిసెంబరు 14న ఎన్నికయ్యాడు.[7] ఆయన 2022 జనవరి 27న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (15 December 2021). "ఆరూ.. కారుకే!". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ "L Ramana Profile Telangana". TNP. Hyderabad. 19 May 2016.
- ↑ Dayashankar, K. M. (29 December 2012). "Naidu's yatra boosts cadre morale". The Hindu. Karimnagar. Archived from the original on 1 జనవరి 2013. Retrieved 14 January 2013.
TDP legislators L. Ramana
- ↑ Sakshi (9 July 2021). "టీడీపీకి ఎల్.రమణ గుడ్‌బై". Sakshi. Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
- ↑ Namasthe Telangana (12 July 2021). "టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్ రమణ". Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
- ↑ Namasthe Telangana (16 July 2021). "సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన ఎల్ రమణ". Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
- ↑ V6 Velugu (14 December 2021). "సిక్స్ కొట్టిన టీఆర్ఎస్" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (27 January 2022). "ఎమ్మెల్సీగా ఎల్. రమణ ప్రమాణ స్వీకారం". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
వర్గాలు:
- Marriage template errors
- తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
- 1961 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- జగిత్యాల జిల్లా రాజకీయ నాయకులు
- జగిత్యాల జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- జగిత్యాల జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు
- జగిత్యాల జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు