బోర్లకుంట వెంకటేశ్ నేత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని
బోర్లకుంట వెంకటేశ్ నేత


ఎంపీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019- ప్రస్తుతం
నియోజకవర్గం పెద్దపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం 16 జూన్ 1976
తిమ్మాపూర్, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత రాష్ట్ర సమితి పార్టీ, కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రాజాం బోర్లకుంట, లింగమ్మ
జీవిత భాగస్వామి శ్రీలక్ష్మి
సంతానం 2
నివాసం హైదరాబాద్ , మందమర్రి

బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి[1] పార్టీ తరపున 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

బోర్లకుంట వెంకటేశ్‌ నేత 1976, జూన్ 16న బోర్లకుంట రాజాం, లింగమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, తిమ్మాపూర్ గ్రామంలో జన్మించాడు. ఎంకాం, ఎల్ఎల్ఎం పూర్తిచేసిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి 2015లో `సివిల్ సర్వీస్ సిస్టమ్ ఇన్ ఇండియా`, యుకె, యుఎస్ఎ- రాజ్యాంగ దృక్పథాల తులనాత్మక అధ్యయనం అనే అంశంపై పి.హెచ్.డి. పూర్తి చేశాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

వెంకటేష్ కు 2006, నవంబరు 26న శ్రీలక్ష్మీతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రాజకీయాలలో చేరకముందు ఎక్సైజ్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహించాడు.[4]

రాజకీయ జీవితం[మార్చు]

బోర్లకుంట వెంకటేశ్‌ నేత 2018లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.[5] ఆయన 2019, మార్చి 21న కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.[6] ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎ.చంద్రశేఖర్‌ పై 95,180 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచాడు.[7] 2019 సెప్టెంబరు 13 నుండి 2020 సెప్టెంబరు 12 వరకు విదేశీ వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. 2020 సెప్టెంబరు 13 నుండి సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[8]

వెంకటేష్ నేత 2024 ఫిబ్రవరి 06న ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్‌, సీఎం రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[9]. ఆయన 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న వెంకటేశ్ నేత 2024 ఏప్రిల్ 29న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[10]

ఇతర వివరాలు[మార్చు]

యుకె, యుఎస్ఎ మొదలైన దేశాలు పర్యటించాడు.

మూలాలు[మార్చు]

  1. "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2019". Election Commission of India. 2021-08-19.
  2. Sakshi (2019). "Peddapalle Constituency Winner List in Telangana Elections 2019 | Peddapalle Constituency MP Election Results 2019". Archived from the original on 11 August 2021. Retrieved 11 August 2021.
  3. Suares, Coreena (2019-05-28). "All 17 Telangana MPs are educated". Deccan Chronicle. Retrieved 2021-08-19.
  4. Eenadu (22 October 2023). "కొలువు వదిలి.. అధ్యక్షా అని పిలిచి". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  5. The Hans India (29 November 2018). "Trounce TRS: Congress candidate appeals people". Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 11 August 2021.
  6. Chauhan, Ramesh (7 April 2019). "'సింగరేణి' బ్రహ్మరథం.. సిఎం కెసిఆర్ పథకాలే నా గెలుపునకు బాటలు". Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 11 August 2021.
  7. Sakshi (24 May 2019). "ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను". Archived from the original on 11 August 2021. Retrieved 11 August 2021.
  8. "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 2021-08-19.
  9. Sakshi (7 February 2024). "కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేశ్‌ నేత". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.
  10. 10TV Telugu (29 April 2024). "ఎన్నికల వేళ.. బీజేపీలోకి ఎంపీ, మాజీ మంత్రి" (in Telugu). Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)