మందమర్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?మందమర్రి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°58′56″N 79°28′52″E / 18.98222°N 79.48111°E / 18.98222; 79.48111
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 38.84 కి.మీ² (15 చ.మై)[1]
జిల్లా(లు) మంచిర్యాల జిల్లా
జనాభా
జనసాంద్రత
65,670 (2011 నాటికి)
• 1,691/కి.మీ² (4,380/చ.మై)
భాష(లు) తెలుగు
పురపాలక సంఘం మందమర్రి పురపాలక సంఘము


మందమర్రి, తెలంగాణ రాష్ట్రములోని మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము, అదే పేరు గల మండలానికి కేంద్రం.[2] పిన్ కోడ్ నం. 504231.

గుణాంకాలు[మార్చు]

జనాభా 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం- మొత్తం 1,00,109 - పురుషులు 51,324 - స్త్రీలు 48,785

వ్యవసాయం, పంటలు[మార్చు]

మందమర్రి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 1239 హెక్టార్లు మరియు రబీలో 531 హెక్టార్లు. ప్రధాన పంట జొన్నలు.[3]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు[మార్చు]

  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016. 
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 186

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మందమర్రి&oldid=2496830" నుండి వెలికితీశారు