మందమర్రి పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మందమర్రి పురపాలకసంఘం
మందమర్రి
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
మంచిర్యాల
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

మందమర్రి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఈ పురపాలక సంఘం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలోని, చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందినది.

చరిత్ర[మార్చు]

గ్రామ పంచాయతీగా ఉన్న మందమర్రి కొన్ని రాజకీయ కారణాల వల్ల 1993లో నోటిఫైడ్ ఏరియాగా మారింది.1995 మే 8 న మందమర్రిని గ్రేడ్-3 మున్సిపాలిటీ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.58 వేల జనాభా ఉన్న మందమర్రి మున్సిపాలిటీలో 32 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ పురపాలక సంఘాన్ని 24 వార్డులుగా విభజించి 1998 మే 21వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు ఇచ్చింది. చైర్మన్ అభ్యర్థి పదవికి ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కేటాయించారు. అయితే మందమర్రి ఏజెన్సీ ఏరియాలో ఉండటం వల్ల గ్రామ పంచాయతీ 7/70 చట్ట పరిధిలో ఉన్న కారణంగా ఇక్కడ ఎన్నికలు నిలిపేయాలని అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్ మద్ది రాంచందర్ ప్రభుత్వం తీసుకున్న ఎన్నికల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో రిట్ ఫిటిషన్ దాఖలు చేశారు.ఒక వేళ ఎన్నికలు జరపవలసి వస్తే ఎస్టీలకు మాత్రమే చైర్మన్ పదవి కేటాయించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఎన్నికలు నిలిపేస్తూ 1998 జూన్ 18న హైకోర్టు స్టే జారీ చేసింది. తరువాత ఈ కేసును 2005 ఏప్రిల్ 5 కేసును హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కోర్టు కేసు వలన 16 ఏళ్లుగా ఈ పురపాలక సంఘానికి ఎన్నికలు లేవు.[1][2]

భౌగోళికం[మార్చు]

మందమర్రి పురపాలక సంఘం ఉత్తర అక్షాంశానికి 18 0 -51 ', తూర్పు రేఖాంశంలో 72 0 -27' మధ్య ఉంది.రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 257 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

ఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 52,352 మంది జనాభా ఉన్నరు. ఉండగా అందులో పురుషులు 26,808, మహిళలు25,544 మంది ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3939 ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 73.40% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 81.56% కాగా, మహిళా అక్షరాస్యత 64.89%.ఉన్నారు. ఈ పురపాలక సంఘంలో ఎక్కువ మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. మొత్తం 12,864 ఇళ్లకు పైగా పరిపాలన ఉంది. నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను ఉన్నాయి.మున్సిపాలిటీ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, పురపాలక సంఘ పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా అధికారం ఉంది.[3]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 36 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు.[4]

మూలాలు[మార్చు]

  1. "మందమర్రి మున్సిపాల్టీని వీడని గ్రహణం 16 ఏళ్లుగా ఎన్నికలు లేవు". Sakshi. 2014-03-04. Retrieved 2021-03-29.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 June 2016. Retrieved 29 March 2021.
  3. "Mandamarri Municipality City Population Census 2011-2021 | Andhra Pradesh జనాభా వివరాలు". www.census2011.co.in. Retrieved 2021-03-29.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 June 2016. Retrieved 29 March 2021.

వెలుపలి లంకెలు[మార్చు]