అచ్చంపేట పురపాలకసంఘం
| అచ్చంపేట పురపాలకసంఘం | |
| — పురపాలకసంఘం — | |
| అక్షాంశరేఖాంశాలు: 16°26′29″N 78°43′30″E / 16.4414440°N 78.7249469°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | నాగర్‌కర్నూల్ |
| మండలం | అచ్చంపేట |
| ప్రభుత్వం | |
| - చైర్‌పర్సన్ | |
| - వైస్ చైర్‌పర్సన్ | |
| వైశాల్యము | |
| - మొత్తం | 18.70 km² (7.2 sq mi) |
| జనాభా (2011) | |
| - మొత్తం | 28,425 |
| - పురుషుల సంఖ్య | 14,597 |
| - స్త్రీల సంఖ్య | 13,828 |
| పిన్ కోడ్ - 509375 | |
| Area code(s) | ఎస్.టి.డి కోడ్ - 08541 |
| వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ | |
అచ్చంపేట పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] అచ్చంపేట పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం లోని అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న అచ్చంపేట 2013 జూన్ 25న పురపాలక సంఘంగా ఏర్పడింది.
భౌగోళికం
[మార్చు]అచ్చంపేట 18.70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16°23′56″N 78°38′13″E / 16.399°N 78.637°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 130 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం నాగర్‌కర్నూల్ నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 28425 మంది కాగా, అందులో 14597 మంది పురుషులు, 13828 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 24 రెవెన్యూ వార్డుగా విభజించబడింది.[3]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2021, ఏప్రిల్ 30న జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- గౌరీశంకర్
- ఎస్. నిర్మల
- సోమ్లా నాయక్
- మహారాజ్ బేగం
- ఎ. లావణ్య
- గడ్డం రమేష్
- నూరి బేగం
- చిట్టెమ్మ
- సుగుణమ్మ
- సునీత
- ఎం. సంధ్య
- ఖాజాబి
- అంతటి శివ
- జి. శ్రీనివాస్
- మన్ను ప్రసాద్
- ఎడ్ల నరసింహా గౌడ్
- తగరం శ్రీను
- గోపిశెట్టి శివ
- శైలజ
- రమేష్ రావు
మూలాలు
[మార్చు]- ↑ "Atchampet Municipality". atchampetmunicipality.telangana.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 April 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. the original నుండి 4 December 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 April 2021.
- ↑ "Basic Information of Municipality, Atchampet Municipality". atchampetmunicipality.telangana.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (3 May 2021). "అచ్చంపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం". Namasthe Telangana. the original నుండి 3 May 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 May 2021.