Coordinates: 17°01′46″N 78°14′10″E / 17.0294797°N 78.2362225°E / 17.0294797; 78.2362225

షాద్‌నగర్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాద్‌నగర్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
షాద్‌నగర్ పురపాలకసంఘం is located in తెలంగాణ
షాద్‌నగర్ పురపాలకసంఘం
షాద్‌నగర్ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°01′46″N 78°14′10″E / 17.0294797°N 78.2362225°E / 17.0294797; 78.2362225
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం ఫరూఖ్‌నగర్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ నరేందర్ కొండూటి
 - వైస్ చైర్‌పర్సన్‌ ఎం. నటరాజన్
వైశాల్యము
 - మొత్తం 32.19 km² (12.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 54,431
 - పురుషుల సంఖ్య 27,713
 - స్త్రీల సంఖ్య 26,718
 - గృహాల సంఖ్య 11,366
పిన్ కోడ్ - 509216
ఎస్.టి.డి కోడ్ - 08548
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

షాద్‌నగర్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] షాద్‌నగర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న షాద్‌నగర్, 2011, ఆగస్టు 24న పురపాలక సంఘంగా ఏర్పడింది.[1]

భౌగోళికం[మార్చు]

షాద్‌నగర్ 32.19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°03′54″N 78°12′40″E / 17.065°N 78.211°E / 17.065; 78.211 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 54431 మంది కాగా, అందులో 27713 మంది పురుషులు, 26718 మంది మహిళలు ఉన్నారు. 11366 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 14 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 28 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో నరేందర్ కొండూటి చైర్‌పర్సన్‌గా, ఎం. నటరాజన్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[5]

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. మహ్మద్ గౌస్
  2. చెట్ల పావని
  3. శ్రీనివాస్ రాయల్
  4. అల్లోనిపల్లి శ్రీనివాస్
  5. కృష్ణవేణి. ఎస్
  6. లతాశ్రీ పులిమామిడి
  7. రాజేశ్వర్ సలేంద్రం
  8. శాంతమ్మ
  9. ప్రతాప్ రెడ్డి తాండపల్లి
  10. కావలి శ్రావణి
  11. పిల్ల శారద
  12. అకుల చంద్రకళ
  13. కనుగు అంతయ్య
  14. బి. నర్సింలు
  15. ఎం. మానస
  16. ఎం. నటరాజన్ (వైస్ చైర్మన్)
  17. మహ్మద్ సర్వర్ పాషా
  18. ఎం. ప్రేమలత
  19. అరీఫా బేగం మహ్మద్
  20. మహేశ్వరి కొండూటి
  21. శ్రీనివాస్ గోపాలపురం తెలుగు
  22. ఎన్. సరిత
  23. అగనూర్ విశాల
  24. రెటికల్ నందిశ్వర్
  25. జి. మాధురి
  26. వెంకట్రామ్ రెడ్డి ఇగా
  27. కౌసల్య .కె
  28. నరేందర్ కొండూటి (చైర్మన్)

కో-ఆప్షన్ సభ్యులు[మార్చు]

  1. ఒగ్గు కిషోర్
  2. షరాజ్ బేగం
  3. మహ్మద్ గౌస్ జాని
  4. ఎం.ఎస్. పద్మ

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Shadnagar Municipality". shadnagarmunicipality.telangana.gov.in. Archived from the original on 21 అక్టోబరు 2021. Retrieved 26 March 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 26 March 2021.
  3. "Basic Information of Municipality, Shadnagar Municipality". shadnagarmunicipality.telangana.gov.in. Archived from the original on 24 జనవరి 2022. Retrieved 26 March 2021.
  4. "Municipal Council, Shadnagar, Shadnagar Municipality". shadnagarmunicipality.telangana.gov.in. Archived from the original on 24 జనవరి 2022. Retrieved 26 March 2021.
  5. skannegari. "Shadnagar Municipality 28 wards Election Notification - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.

వెలుపలి లంకెలు[మార్చు]