క్యాతన్‌పల్లి పురపాలకసంఘం
| క్యాతన్‌పల్లి పురపాలకసంఘం | |
| — పురపాలకసంఘం — | |
| అక్షాంశరేఖాంశాలు: 18°57′27″N 79°52′28″E / 18.9575238°N 79.8744836°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | మంచిర్యాల |
| మండలం | మందమర్రి |
| ప్రభుత్వం | |
| - చైర్‌పర్సన్ | |
| - వైస్ చైర్‌పర్సన్ | |
| వైశాల్యము | |
| - మొత్తం | 16.8 km² (6.5 sq mi) |
| జనాభా (2011) | |
| - మొత్తం | 34,819 |
| - పురుషుల సంఖ్య | 17,020 |
| - స్త్రీల సంఖ్య | 17,799 |
| - గృహాల సంఖ్య | 10,412 |
| పిన్ కోడ్ | 504214 |
| Area code(s) | టెలిఫోన్ కోడ్ |
| -08736 | |
| వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ | |
క్యాతన్‌పల్లి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] క్యాతన్‌పల్లి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం లోని చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న క్యాతన్‌పల్లి, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3] గద్దెరగడి, దుబ్బపాల్, క్యాతన్‌పల్లి, కుర్మపల్లి, శేషుపల్లి, అమరవాది, రామకృష్ణాపూర్, తిమ్మపూర్ మొదలైన గ్రామ పంచాయితీలను కలిపి ఈ పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేశారు.
భౌగోళికం
[మార్చు]క్యాతన్‌పల్లి 16.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°33′29″N 79°16′16″E / 18.558°N 79.271°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 264 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం మంచిర్యాల నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 34819 మంది కాగా, అందులో 17020 మంది పురుషులు, 17799 మంది మహిళలు ఉన్నారు. 10412 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 15 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 22 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- పోగుల మల్లయ్య
- పుల్లూరి సుధాకర్
- కొక్కుల శ్రవంతి
- రెవేల్లి ఓడెలు
- జిలకర్ర మహేష్
- విద్యాసాగర్ రెడ్డి
- సత్యనారాయణ
- అలుగుల శ్రీలత
- పారిపెల్లి తిరుపతి
- పనస రాజు
- సంపత్ కుమార్
- బొద్దుల రమ్య
- జాడి శ్రీనివాస్
- గడ్డం విజయలక్ష్మి
- బింగి శివాని
- మేకల తిరుమల
- రామిడి ఉమదేవి
- గంటాలమ్మ
- జంగం కళ
- బి. అనిల్ రావు
- పార్వతి విజయ
- ఎర్రబెల్లి ప్రేమలత
మూలాలు
[మార్చు]- ↑ "Kyathanpally Municipality". kyathanpallymunicipality.telangana.gov.in. the original నుండి 13 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. the original నుండి 4 December 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." the original నుండి 13 September 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ "Basic Information of Municipality, Kyathanpally Municipality". kyathanpallymunicipality.telangana.gov.in. the original నుండి 2020-09-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ admin (2020-05-20). "Kyathanpally municipality Councillors list 2020". Telangana data. the original నుండి 2021-05-13 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
వెలుపలి లంకెలు
[మార్చు]- క్యాతన్‌పల్లి పురపాలక సంఘ అధికారిక వెబ్‌సైటు Archived 2021-05-13 at the Wayback Machine