Jump to content

ఆత్మకూరు పురపాలకసంఘం

అక్షాంశ రేఖాంశాలు: 16°20′38″N 77°48′50″E / 16.3438728°N 77.8138553°E / 16.3438728; 77.8138553
వికీపీడియా నుండి
ఆత్మకూరు పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
ఆత్మకూరు పురపాలకసంఘం is located in తెలంగాణ
ఆత్మకూరు పురపాలకసంఘం
ఆత్మకూరు పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 16°20′38″N 77°48′50″E / 16.3438728°N 77.8138553°E / 16.3438728; 77.8138553
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి
మండలం ఆత్మకూరు
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ గాయత్రి
 - వైస్ చైర్‌పర్సన్‌ విజయభాస్కర్
వైశాల్యము
 - మొత్తం 23.55 km² (9.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 15,036
 - పురుషుల సంఖ్య 7,424
 - స్త్రీల సంఖ్య 7,612
 - గృహాల సంఖ్య 3,958
పిన్ కోడ్ - 509131
Area code(s) ఎస్.టి.డి కోడ్ - 08517
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

ఆత్మకూరు పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] ఆత్మకూరు పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని మక్తల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న ఆత్మకూరు, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం

[మార్చు]

ఆత్మకూర్ 23.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16°20′24″N 77°47′56″E / 16.340°N 77.799°E / 16.340; 77.799 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 180 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం వనపర్తి నుండి 31 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 15036 మంది కాగా, అందులో 7424 మంది పురుషులు, 7612 మంది మహిళలు ఉన్నారు. 3958 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 10 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం గాయత్రి చైర్‌పర్సన్‌గా, విజయభాస్కర్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
  1. బి. చెన్నయ్య
  2. గాయత్రి యాదవ్
  3. అశ్విన్ కుమార్
  4. ఎ. మహేశ్వరి
  5. ఎర్కలి పోషన్న
  6. సి. యాదమ్మ
  7. నాగలక్ష్మి
  8. విజయ భాస్కర్ రెడ్డి
  9. మండ్ల రామకృష్ణ
  10. తబస్సం బేగం

మూలాలు

[మార్చు]
  1. "Atmakur Municipality". atmakurmunicipality.telangana.gov.in. Retrieved 13 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 13 April 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 13 April 2021.
  4. "Basic Information of Municipality, Atmakur Municipality". atmakurmunicipality.telangana.gov.in. Retrieved 13 April 2021.[permanent dead link]
  5. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 13 April 2021.
  6. admin (2020-05-17). "Atmakur municipality Councillors list 2020". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-06-29. Retrieved 2021-05-18.

వెలుపలి లంకెలు

[మార్చు]