అమీన్పూర్ పురపాలకసంఘం
అమీన్పూర్ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°30′33″N 78°18′00″E / 17.5090780°N 78.3001221°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండలం | అమీన్పూర్ |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | తుమ్మల పాండురంగారెడ్డి |
- వైస్ చైర్పర్సన్ | నందారం నర్సింహగౌడ్ |
వైశాల్యము | |
- మొత్తం | 17.83 km² (6.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 44,698 |
- పురుషుల సంఖ్య | 23,081 |
- స్త్రీల సంఖ్య | 21,617 |
- గృహాల సంఖ్య | 12,056 |
పిన్ కోడ్ - 502032 | |
Area code(s) | ఎస్.టి.డి కోడ్ - 08692 |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
అమీన్పూర్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] అమీన్పూర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మెదక్ లోక్‌సభ నియోజకవర్గం లోని పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న అమీన్పూర్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3] అమీన్పూర్, బీరంగూడ, బంధంకొమ్ము, ఉసికబావి, నర్రెగూడెం మొదలైన గ్రామ పంచాయితీలను కలపి ఈ పురపాలకసంఘం ఏర్పాటుచేశారు.
భౌగోళికం
[మార్చు]అమీన్పూర్ 17.83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°18′43″N 78°11′42″E / 17.312°N 78.195°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 26.1 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం సంగారెడ్డి నుండి 32.2 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 44698 మంది కాగా, అందులో 23081 మంది పురుషులు, 21617 మంది మహిళలు ఉన్నారు. 12056 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 19 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 24 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం తుమ్మల పాండురంగారెడ్డి చైర్‌పర్సన్‌గా, నందారం నర్సింహగౌడ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- పాండురంగారెడ్డి
- బాసెట్టి కృష్ణ
- పటోళ్ళ కల్పన
- రాజేశ్వరి
- మహాదేవరెడ్డి
- పురమ్శెట్టి మాధురి
- బిజిలి రాజు
- వనిత జగదీష్
- కొల్లూరి మల్లెష్
- బోయిని బాలమణి
- మంజుల ప్రమోద్ రెడ్డి
- నర్సింహ గౌడ్
మూలాలు
[మార్చు]- ↑ "Ameenpur Municipality". ameenpurmunicipality.telangana.gov.in. Archived from the original on 31 అక్టోబరు 2020. Retrieved 17 April 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 17 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 17 April 2021.
- ↑ "Basic Information of Municipality, Ameenpur Municipality". ameenpurmunicipality.telangana.gov.in. Archived from the original on 4 జూలై 2020. Retrieved 17 April 2021.
- ↑ సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 17 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 17 April 2021.
వెలుపలి లంకెలు
[మార్చు]- అమీన్పూర్ పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు Archived 2020-10-31 at the Wayback Machine