మంచిర్యాల పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంచిర్యాల పురపాలకసంఘం
మంచిర్యాల
పురపాలక సంఘ భవనం
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
మంచిర్యాల
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

మంచిర్యాల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఈ పురపాలక సంఘం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలోని, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన నగరపంచాయితీ.

చరిత్ర[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నూతన జిల్లాల్లో మంచిర్యాల ఒకటి. ఈ జిల్లాలో మొత్తం 7 పురపాలక సంఘాలు ఉన్నాయి.

భౌగోళికం[మార్చు]

ఇది 18° 52' 32.142 N 79° 27' 32.8932 E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1] రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

ఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 87,153 మంది జనాభా ఉన్నరు. ఉండగా అందులో పురుషులు 51%, మహిళలు 49% మంది ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 14,190 ఉన్నారు. అక్షరాస్యత పురుష జనాభాలో 83% ఉండగా, స్త్రీ జనాభాలో 67% అక్షరాస్యులు ఉన్నారు. ఈ పురపాలక సంఘంలో ఎక్కువ మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు.[2][3]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 36 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[4] ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం పెంట రాజయ్య చైర్‌పర్సన్‌గా, ముకేశ్ గౌడ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. బుద్ధార్తి సతమ్మ
  2. సల్లా మహేష్
  3. అబ్దుల్ మజీద్
  4. మోతే సుజాత
  5. సూదమల్ల హరికృష్ణ
  6. సుంకరి శ్వేత
  7. బదావత్ ప్రకాష్
  8. పెంట రాజయ్య
  9. బొలిశెట్టి సునీత
  10. అసంపల్లి లావణ్య
  11. జోగుల శ్రీలత
  12. సల్లా తార
  13. నల్లా శంకర్
  14. పోరెడ్డి రాజయ్య
  15. శ్రీరాముల సుజాత
  16. బొరిగం శ్రీనివాస్
  17. పుడారి సునీత
  18. హఫీజా బేగం
  19. వంగపల్లి అనిత
  20. అంకం నరేష్ కుమార్
  21. కొండ పద్మ
  22. మేరుగు మహేశ్వరి
  23. రామగిరి బానేష్
  24. వేములపల్లి సంజీవి
  25. మినాజుద్దీన్
  26. నాంపల్లి మాధవి
  27. సిరికొండ పద్మ
  28. పల్లపు సాయి భార్గవి
  29. కన్నంతారెడ్డి చైతన్య
  30. రావుల ఉప్పలయ్య
  31. సురేష్ బల్దవ
  32. గాడే సతయ్య
  33. జగ్గారి సుమతి
  34. ఎం. సత్యనారాయణ
  35. అఫ్రీన్ సుల్తాన
  36. గాజుల ముఖేష్ గౌడ్

మూలాలు[మార్చు]

  1. "అక్షాంశాలు రేఖాంశాలు". www.latlong.net. Retrieved 2021-03-12.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "About Mancherial". Mancherial municipality. Archived from the original on 2022-01-20. Retrieved 2021-03-02.
  3. "Mancherial Metropolitan Urban Region Population 2011-2021 Census". www.census2011.co.in. Retrieved 2021-03-02.
  4. Sumitra (2020-01-06). "మున్పిపోల్స్: మంచిర్యాల జిల్లా ఓటర్ల ముసాయిదా..రిజర్వేషన్లు". www.hmtvlive.com. Archived from the original on 2021-06-06. Retrieved 2021-03-02.
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 3 March 2021.
  6. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 3 March 2021.