వికారాబాదు పురపాలకసంఘం
వికారాబాదు పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°19′35″N 77°57′04″E / 17.3263608°N 77.9510209°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు |
మండలం | వికారాబాద్ |
ప్రభుత్వం | |
- చైర్‌పర్సన్ | |
- వైస్ చైర్‌పర్సన్ | |
వైశాల్యము | |
- మొత్తం | 64 km² (24.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 53,143 |
- పురుషుల సంఖ్య | 26,467 |
- స్త్రీల సంఖ్య | 26,676 |
- గృహాల సంఖ్య | 11,122 |
పిన్ కోడ్ - 501101 | |
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ |
మేడ్చల్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] వికారాబాద్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం లోని వికారాబాదు శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న వికారాబాదు, 1987లో పురపాలక సంఘంగా ఏర్పడింది.
భౌగోళికం
[మార్చు]మేడ్చల్ 64 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°20′10″N 77°54′14″E / 17.336°N 77.904°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 53143 మంది కాగా, అందులో 26467 మంది పురుషులు, 26676 మంది మహిళలు ఉన్నారు. 11122 గృహాలు ఉన్నాయి ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 6 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 34 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చిగుళ్ళపల్లి ముంజుల రమేశ్ చైర్‌పర్సన్‌గా, శంషాద్ బేగం వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- జి. వేణుగోపాల్ రెడ్డి
- చనగళ రాములు
- ఎం. మంజుల
- నస్రీన్ బేగం
- పాల్ గుట్ట ప్రవల్లిక
- చందర్ నాయక్
- పరిగి సంతోష
- కె. గోపాల్
- షంషాద్ బేగం
- అంగోత్ దేవి ఎస్టీ
- చండిప్ప అనిత
- పి. ప్రభాకర్ రెడ్డి
- మేక పావని
- సి. రామస్వామి
- చిత్యాల అనంత్ రెడ్డి
- అల్లోరి రాజలక్ష్మి
- ఫైముదా బేగం
- కొండేటి కృష్ణ
- ఆర్. నర్సింహులు
- జైదుపల్లి మురళి
- తోకల కృష్ణారెడ్డి
- సుధామ్ష్ కిరణ్ పటేల్
- కలల్ ప్రభావతి
- తొడిగెల శ్రీదేవి
- చిగుల్లపల్లి మంజుల
- గౌండ్ల సునీత
- హిరేకర్ సురేష్
- మోముల స్వాతి
- లంక పుష్పలత రెడ్డి
- బొండల సువర్ణ
- ఎం. గాయత్రి
- ఎం. నవీన్ కుమార్
- అర్థ సుధాకర్ రెడ్డి
- జి. అనంతలక్ష్మి
మూలాలు
[మార్చు]- ↑ "Vikarabad Municipality". vikarabadmunicipality.telangana.gov.in. Retrieved 2021-04-03.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 3 April 2021.
- ↑ "Basic Information of Municipality, Vikarabad Municipality". vikarabadmunicipality.telangana.gov.in. Retrieved 2021-04-03.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 3 April 2021.
- ↑ admin (2020-05-20). "Vikarabad Municipality Councillors list 2020". Telangana data. Archived from the original on 2021-05-17. Retrieved 17 May 2021.