Jump to content

నకిరేకల్ పురపాలకసంఘం

అక్షాంశ రేఖాంశాలు: 17°10′41″N 79°26′52″E / 17.1781654°N 79.4478858°E / 17.1781654; 79.4478858
వికీపీడియా నుండి
నకిరేకల్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
నకిరేకల్ పురపాలకసంఘం is located in తెలంగాణ
నకిరేకల్ పురపాలకసంఘం
నకిరేకల్ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°10′41″N 79°26′52″E / 17.1781654°N 79.4478858°E / 17.1781654; 79.4478858
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం నకిరేకల్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ రాచకొండ శ్రీనివాస్
 - వైస్ చైర్‌పర్సన్‌ మురారిశెట్టి ఉమారాణి
వైశాల్యము
 - మొత్తం 18.26 km² (7.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 29,126
పిన్ కోడ్ - 508211
Area code(s) ఎస్.టి.డి కోడ్ - 08682
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

నకిరేకల్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] నకిరేకల్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం లోని నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

భౌగోళికం

[మార్చు]

నకిరేకల్ 18.26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°09′50″N 79°25′37″E / 17.164°N 79.427°E / 17.164; 79.427 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 109 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం నల్గొండ నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2021, ఏప్రిల్ 30న జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం రాచకొండ శ్రీనివాస్ చైర్‌పర్సన్‌గా, మురారిశెట్టి ఉమారాణి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[3] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
  1. బిక్షం రెడ్డి
  2. సునీల్
  3. చింత స్వాతి త్రిమూర్తులు
  4. గాజుల సుకన్య
  5. వంటేపాక సోమలక్మి
  6. మంగినిపల్లి ధనమ్మ
  7. కొండ శ్రీను
  8. పన్నాల పావని శ్రీనివాసరెడ్డి
  9. చౌగోని రజిత
  10. చౌగోని అఖిల
  11. మురారిశెట్టి ఉమారాణి (వైస్ చైర్‌పర్సన్‌)
  12. భానోతు వెంకన్న
  13. పోతుల రవి
  14. గడ్డం స్వామి
  15. యసారపు లక్మి వెంకన్న
  16. గర్షకోటి సైదులు
  17. పల్లె విజయ్
  18. దైద స్వప్న రవీందర్
  19. రాచకొండ శ్రీనివాస్ (చైర్‌పర్సన్‌)
  20. చెవుగోని రాములమ్మ

మూలాలు

[మార్చు]
  1. "Nakrekal Municipality". nakrekalmunicipality.telangana.gov.in. Retrieved 2021-06-12.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 12 June 2021.
  3. నమస్తే తెలంగాణ, తెలంగాణ (3 May 2021). "జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్, అచ్చంపేట‌ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం". Namasthe Telangana. Archived from the original on 3 May 2021. Retrieved 12 June 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]