కొత్తకోట పురపాలకసంఘం
| కొత్తకోట పురపాలకసంఘం | |
| — పురపాలకసంఘం — | |
| అక్షాంశరేఖాంశాలు: 16°21′07″N 77°57′04″E / 16.3518268°N 77.9510209°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | వనపర్తి |
| మండలం | కొత్తకోట |
| ప్రభుత్వం | |
| - చైర్‌పర్సన్ | పొగాకు సుఖేషిని |
| - వైస్ చైర్‌పర్సన్ | బీసం జయమ్మ |
| వైశాల్యము | |
| - మొత్తం | 12.79 km² (4.9 sq mi) |
| జనాభా (2011) | |
| - పురుషుల సంఖ్య | 9,610 |
| - స్త్రీల సంఖ్య | 9,432 |
| 19,042 | |
| పిన్ కోడ్ - 509381 | |
| Area code(s) | ఎస్.టి.డి కోడ్ - 08582 |
| వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ | |
కొత్తకోట పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] కొత్తకోట పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న కొత్తకోట, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
[మార్చు]పెబ్బేరు 12.79 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16°22′52″N 77°56′24″E / 16.381°N 77.940°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 135 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం వనపర్తి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 19042 మంది కాగా, అందులో 9610 మంది పురుషులు, 9432 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 24 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం పొగాకు సుఖేషిని చైర్‌పర్సన్‌గా, బీసం జయమ్మ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- కొండారెడ్డి బాలయ్య
- చిన్న రాములు
- బీసం జయమ్మ (వైస్ చైర్‌పర్సన్)
- ఎస్. నారాయణమ్మ
- టి. సంధ్య
- చింతలపల్లి సంధ్యారాణి
- నవీన్ కుమార్ రెడ్డి
- సి. నాగన్న
- పొగాకు సుఖేషిని (చైర్‌పర్సన్)
- ఓల్గుమాన్ తిరుపతి
- కొమ్ము భరత్ భూషణ్
- మహేశ్వరి
- పి. రామ్ మోహన్ రెడ్డి
- ఎన్. పద్మమ్మ
- ఖాజా మొయినుద్దీన్
మూలాలు
[మార్చు]- ↑ "Kothakota Municipality". kothakotamunicipality.telangana.gov.in. the original నుండి 14 ఏప్రిల్ 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. the original నుండి 4 December 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." the original నుండి 13 September 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2021.
- ↑ "Basic Information of Municipality, Kothakota Municipality". kothakotamunicipality.telangana.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2021.
- ↑ "Council, Kothakota Municipality". kothakotamunicipality.telangana.gov.in. the original నుండి 23 జూన్ 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 April 2021.
- ↑ సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే". Sakshi. the original నుండి 27 January 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 April 2021.
వెలుపలి లంకెలు
[మార్చు]- కొత్తకోట పురపాలక సంఘ అధికారిక వెబ్‌సైటు Archived 2021-04-14 at the Wayback Machine