బొల్లారం పురపాలకసంఘం
బొల్లారం పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండలం | జిన్నారం |
ప్రభుత్వం | |
- చైర్‌పర్సన్ | కోలన్ రోజారాణి |
- వైస్ చైర్‌పర్సన్ | అనిల్‌రెడ్డి |
వైశాల్యము | |
- మొత్తం | 8.35 km² (3.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 34,667 |
- పురుషుల సంఖ్య | 19,385 |
- స్త్రీల సంఖ్య | 15,282 |
- గృహాల సంఖ్య | 7,150 |
పిన్ కోడ్ - 502 325 | |
Area code(s) | టెలిఫోన్ కోడ్ - 08458 |
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ |
బొల్లారం పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] ఐడిఎ బొల్లారం పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మెదక్ లోక్‌సభ నియోజకవర్గం లోని పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న ఐడిఎ బొల్లారం, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
[మార్చు]బొల్లారం 8.35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°33′07″N 78°20′10″E / 17.552°N 78.336°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం సంగారెడ్డి నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 34667 మంది కాగా, అందులో 19385 మంది పురుషులు, 15282 మంది మహిళలు ఉన్నారు. 7150 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 17 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 22 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం కోలన్ రోజారాణి చైర్‌పర్సన్‌గా, అనిల్‌రెడ్డి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- పి. చంద్రయ్య
- వి. గోపాలమ్మ
- సాయి కిరణ్ రెడ్డి
- వి. నిహారికా రెడ్డి
- వి. రాధ
- బి. సుజాత
- ఎం. సతీష్
- కె. రోజారాణి
- బీరప్ప యాదవ్
- బి. శైలజ
- ఎం. ప్రమీల
- ఎ. బాలమణి
- వి. వేణుగోపాల్ రెడ్డి
- అనిల్ కుమార్ రెడ్డి
- పి. సంతోష
- వి. చంద్రరెడ్డి
- వి.హన్మంత రెడ్డి
- కె. ప్రభు
- బి. సంధ్య
- పి. సిరి
- కె. జయమ్మ
- వి. శ్రీకాంత్ యాదవ్
మూలాలు
[మార్చు]- ↑ "Bollaram Municipality". bollarammunicipality.telangana.gov.in. Retrieved 2021-04-18.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 18 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 18 April 2021.
- ↑ "Basic Information of Municipality, Bollaram Municipality". bollarammunicipality.telangana.gov.in. Retrieved 2021-04-18.[permanent dead link]
- ↑ సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 18 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 18 April 2021.