Jump to content

నార్శింగి పురపాలకసంఘం

వికీపీడియా నుండి
నార్శింగి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం గండిపేట్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 43 km² (16.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 25,209
 - పురుషుల సంఖ్య 12,394
 - స్త్రీల సంఖ్య 12,815
 - గృహాల సంఖ్య 11,079
పిన్ కోడ్ - 500080
ఎస్.టి.డి కోడ్ - 08413
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

నార్శింగి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] నార్సింగి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలోని, రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న నార్సింగి, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం

[మార్చు]

నార్శింగి చదరపు 43 కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17.38°N 78.35°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 25209 మంది కాగా, అందులో 12394 మంది పురుషులు, 12815 మంది మహిళలు ఉన్నారు. 11079 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 7 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 18 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[5]

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
  1. బి. యాదమ్మ
  2. దారుపల్లి రేఖ
  3. గోపాల విజయ్
  4. అరికె దుర్గేశ్
  5. గంగిడి శివారెడ్డి
  6. పత్తి శ్రీకాంత్ రావు
  7. జి. అరుణ జ్యోతి
  8. పత్తి ప్రవీణ్
  9. లక్ష్మీ ప్రవళిక
  10. ఎం. నాగపూర్ణ
  11. గోపాల సునీత
  12. జి. అమరేందర్ రెడ్డి
  13. వల్కి విజేత
  14. రెడ్డి ఆదిత్య రెడ్డి
  15. లంకల పద్మ
  16. జి. వెంకటేష్
  17. కె. ఉషారాణి
  18. కె. నరేష్

మూలాలు

[మార్చు]
  1. "Narsingi Municipality". narsingimunicipality.telangana.gov.in. Archived from the original on 2021-02-20. Retrieved 2021-03-22.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 22 March 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 2 April 2021.
  4. "Basic Information of Municipality, Narsingi Municipality". narsingimunicipality.telangana.gov.in. Archived from the original on 2 జూలై 2020. Retrieved 22 March 2021.
  5. skannegari. "Narsingi Municipality into 18 wards - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]