మెట్‌పల్లి పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?మెట్‌పల్లి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°50′57″N 78°37′34″E / 18.8492°N 78.6261°E / 18.8492; 78.6261Coordinates: 18°50′57″N 78°37′34″E / 18.8492°N 78.6261°E / 18.8492; 78.6261
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 48.05 కి.మీ² (19 చ.మై)[1]
జిల్లా(లు) కరీంనగర్ జిల్లా
జనాభా
జనసాంద్రత
50,902[1] (2011 నాటికి)
• 1,059/కి.మీ² (2,743/చ.మై)
భాష(లు) తెలుగు
పురపాలక సంఘం మెట్‌పల్లి పురపాలక సంఘము
కోడులు
పిన్‌కోడు

• 505325


మెట్‌పల్లి పురపాలక సంఘం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలానికి చెందిన పట్టణం. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మెట్‌పల్లిని 2004లో పురపాలక సంఘంగా హోదా పెంచబడింది.[2] 2014 మార్చి నాటికి ఈ పురపాలక సంఘం పరిధిలో 24 వార్డులు, 37174 ఓటర్లు ఉన్నారు.మెట్‌పల్లిని ది.11.10.2016 నుండి రెవెన్యూ డివిజను కేంద్రంగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[3]

2014 ఎన్నికలు[మార్చు]

2010 సెప్టెంబరు నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పురపాలక సంఘానికి 2014, మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చైర్‌పర్సన్ స్థానాన్ని జనరల్ (మహిళ) కు కేటాయించారు.

2005 ఎన్నికలు[మార్చు]

2004లో ఏర్పడిన మెట్‌పల్లి పురపాలక సంఘానికి తొలిసారిగా 2005లో ఎన్నికలు నిర్వహించారు. 2005 నుంచి 2010 వరకు ఐదేళ్ళ కాలంలో ముగ్గురు మహిళలు చైర్‌పర్సన్ పదవిని నిర్వహించారు. 2005లో చైర్‌పర్సన్ స్థానాన్ని బిసి (మహిళ) కు కేటాయించగా ఎర్రోల్ల నర్సు, ధర్మపురి నాగరాణి, సుశీల చైర్‌పర్సన్ పదవిని నిర్వహించారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 12, 50. Retrieved 9 June 2016.
  2. ఈనాడు దినపత్రిక, కరీంనగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 09-03-2014
  3. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf

వెలుపలి లింకులు[మార్చు]