Coordinates: 17°14′53″N 78°23′44″E / 17.2480875°N 78.3955986°E / 17.2480875; 78.3955986

శంషాబాద్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంషాబాద్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
శంషాబాద్ పురపాలకసంఘం is located in తెలంగాణ
శంషాబాద్ పురపాలకసంఘం
శంషాబాద్ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°14′53″N 78°23′44″E / 17.2480875°N 78.3955986°E / 17.2480875; 78.3955986
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం శంషాబాద్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 18 km² (6.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 44,651
 - పురుషుల సంఖ్య 23,150
 - స్త్రీల సంఖ్య 21,501
 - గృహాల సంఖ్య 10,500
పిన్ కోడ్ - 501218
ఎస్.టి.డి కోడ్ - 08413
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

శంషాబాద్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] శంషాబాద్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం లోని రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న శంషాబాద్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం[మార్చు]

శంషాబాద్ 18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°15′40″N 78°23′17″E / 17.261°N 78.388°E / 17.261; 78.388 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 44651 మంది కాగా, అందులో 23150 మంది పురుషులు, 21501 మంది మహిళలు ఉన్నారు. 10500 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 21 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 25 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. రాచమల్ల గీత
  2. అంగోతు భద్రు
  3. పోతుగంటి సునీత
  4. ఎండి. జహంగెర్ఖాన్
  5. మస్రత్ జహాన్
  6. వై. కుమార్
  7. నాజియా బేగం
  8. తోకల విజయలక్ష్మి
  9. చెన్నం అశోక్
  10. పెదిరిపటి రాణి
  11. పారేపల్లి లావణ్య
  12. కొండా ప్రవీణ్ గౌడ్
  13. బండి భాగలక్ష్మి
  14. బండి గోపాల్ యాదవ్
  15. మృత సుధాకర్ రెడ్డి
  16. పి. లక్ష్మి శ్రీనివాస్
  17. మేకల వెంకటేష్
  18. కొలన్ శుష్మా
  19. పి. సంజయ్ యాదవ్
  20. ఆర్. రేఖ గణేష్ గుప్తా
  21. అజయ్
  22. ఎం. శ్రీకాంత్ యాదవ్
  23. శ్రవంతి
  24. కోనమోల్ల భరతమ్మ
  25. దేవరంపల్లి పుష్పలత

మూలాలు[మార్చు]

  1. "Shamshabad Municipality". shamshabadmunicipality.telangana.gov.in. Retrieved 26 March 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 26 March 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 26 March 2021.
  4. "Basic Information of Municipality, Shamshabad Municipality". shamshabadmunicipality.telangana.gov.in. Retrieved 26 March 2021.
  5. admin (2020-05-10). "Shamshabad municipality Councillors list 2020". Telangana data. Retrieved 17 May 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు[మార్చు]