నల్గొండ పురపాలకసంఘం
నల్గొండ పట్టణానికి చెందిన పాలక సంస్థ అయిన నల్గొండ పురపాలక సంఘం 1941లో మూడవశ్రేణి పురపాలక సంఘంగా అవతరించి[1] ప్రస్తుతం మొదటి శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. 2001నాటికి పురపాలక సంఘ పరిధిలోని జనాభా 111745 కాగా, 2011 నాటికి 144718 కు పెరిగింది. 2010-11 ఆర్థిక సంవత్సరం ప్రకారం ఈ సంఘం ఆదాయం రూ.39.78 కోట్లు, వ్యయం రూ.39.69 కోట్లు.
చరిత్ర
[మార్చు]1951లో నల్లగొండను మున్సిపాలిటీగా 12 వార్డులతో గ్రేడ్-3 ము న్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జనాభా పెరగడం, పట్టణం క్రమంగా విస్తరించడంతో 1987లో 24 వార్డులతో గ్రేడ్-2 మున్సిపాలిటీగా, 2005లో 36 వార్డులతో గ్రేడ్-1 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది.
2011లో నల్లగొండ మండలంలోని ఆరు గ్రామ పంచాయతీలైన ఆర్జాలబావి, మర్రిగూడ, చర్లపల్లి, శేషమ్మగూడెం, అక్కలాయిగూడెం, మామిళ్లగూడెం, తిప్పర్తి మండలంలోని కేశరాజుపల్లి గ్రామ పంచాయతీలు, వీటి పరిధిలోని మరో పది అవాస గ్రామాలను వీలీనం చేసి 48 వార్డులుగా విస్తరించారు. 2018 ఫిబ్రవరి 3న గ్రేడ్-1 మున్సిపాలిటీగా ఉన్న నల్లగొండ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది.[2]
ఎన్నికలు
[మార్చు]2005 సెప్టెంబరులో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో పి.వెంకట నారాయణగౌడ్ చైర్మెన్‌గా ఎన్నికయ్యారు.[3] 2010 సెప్టెంబరు నుంచి ప్రత్యేక అధికారి పాలనలో ఉండగా 2013, మార్చి 30న మళ్ళీ ఎన్నికలు జరిగాయి.
బయటిలింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-27. Retrieved 2014-03-13.
- ↑ "మహానగరంగా నల్లగొండ!". NT News. 6 November 2025. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 01-10-2005