సుల్తానాబాద్ పురపాలకసంఘం
సుల్తానాబాద్ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 18°31′38″N 79°18′46″E / 18.5272098°N 79.3127543°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి |
మండలం | సుల్తానాబాద్ |
ప్రభుత్వం | |
- చైర్‌పర్సన్ | ముత్యం సునిత |
- వైస్ చైర్‌పర్సన్ | బింధు సుమలత |
వైశాల్యము | |
- మొత్తం | 14.26 km² (5.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 19,772 |
- పురుషుల సంఖ్య | 9,881 |
- స్త్రీల సంఖ్య | 9,891 |
- గృహాల సంఖ్య | 5,172 |
పిన్ కోడ్ - 505185 | |
Area code(s) | టెలిఫోన్ కోడ్ - 087282 |
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ |
సుల్తానాబాద్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] సుల్తానాబాద్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం లోని పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న సుల్తానాబాద్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
[మార్చు]సుల్తానాబాద్ 14.26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°31′16″N 79°19′05″E / 18.521°N 79.318°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 185 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం పెద్దపల్లి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 19772 మంది కాగా, అందులో 9881 మంది పురుషులు, 9891 మంది మహిళలు ఉన్నారు. 5172 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 5 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 15 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం ముత్యం సునిత చైర్‌పర్సన్‌గా, బింధు సుమలత వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- పసేడ్ల మమత
- గాజుల లక్ష్మి
- నిషాత్ కటున్
- బింధు సుమలత (వైస్ చైర్‌పర్సన్)
- పారుపల్లి జ్ఞానేశ్వరి
- ఊట్ల వరప్రదీప్
- కూకట్ల గోపి
- చింతల సునీత
- గొట్టం లక్ష్మి
- అనుమల అరుణ
- తిరుపతి
- రాజయ్య
- కనకయ్య
- శ్రీనివాస్
- ముత్యం సునీత (చైర్‌పర్సన్)
మూలాలు
[మార్చు]- ↑ "Sulthanabad Municipality". sulthanabadmunicipality.telangana.gov.in. Retrieved 2021-05-06.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 6 May 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 6 May 2021.
- ↑ "Basic Information of Municipality, Sulthanabad Municipality". sulthanabadmunicipality.telangana.gov.in. Retrieved 7 May 2021.[permanent dead link]
- ↑ The Hindu, Telangana (27 January 2020). "All top posts of municipalities in Karimnagar go to TRS". Archived from the original on 28 January 2020. Retrieved 7 May 2021.