యాదగిరిగుట్ట పురపాలకసంఘం
| యాదగిరిగుట్ట పురపాలకసంఘం | |
| — పురపాలకసంఘం — | |
| అక్షాంశరేఖాంశాలు: 17°36′55″N 78°54′22″E / 17.6153364°N 78.9061921°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | యాదాద్రి భువనగిరి |
| మండలం | యాదగిరిగుట్ట |
| ప్రభుత్వం | |
| - చైర్‌పర్సన్ | ఎరుకల సుధ |
| - వైస్ చైర్‌పర్సన్ | మేడబోయిన కాటంరాజు |
| జనాభా (2011) | |
| - మొత్తం | 15,637 |
| - పురుషుల సంఖ్య | 7,890 |
| - స్త్రీల సంఖ్య | 7,747 |
| - గృహాల సంఖ్య | 3,160 |
| పిన్ కోడ్ - 508115 | |
| ఎస్.టి.డి కోడ్ - 08685 | |
| వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ | |
యాదగిరిగుట్ట పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] దీని ప్రధాన కార్యాలయ కేంద్రస్థానం యాదగిరిగుట్ట పట్టణం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని, భువనగిరి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితిగా ఉన్న యాదగిరిగుట్ట, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
[మార్చు]యాదగిరిగుట్ట 12.74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, సముద్రమట్టానికి 609.9 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది 170–35 N 780-56’ E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. జిల్లా కేంద్రం భువనగిరి నుండి 12 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాదగిరిగుట్ట మునిసిపాలిటీ ప్రధానంగా నివాస ప్రాంతాల పరిధిలో ఉంది, తరువాత వాణిజ్య, పబ్లిక్ సెమీ పబ్లిక్ కార్యాలయాలు, సినిమా హాల్, టి.ఎస్.ఆర్.టి.సి బస్ డిపో, మార్కెట్ యార్డులు ఉన్నాయి.[4]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 15637 మంది కాగా, అందులో 7890 మంది పురుషులు, 7747 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 15 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[5]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకారం దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సుధ చైర్‌పర్సన్‌గా, మేడబోయిన కాటంరాజు వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[6][7][8] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[9]
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- అరుణ గౌళికార్
- మేడబోయిన కాటంరాజు (వైస్ చైర్‌పర్సన్)
- బూడిద సురేందర్
- విజయాలక్ష్మీ సీస
- గుండ్లపల్లి వాణి
- మాలోతు సరోజ
- ఎరుకల సుధ (చైర్‌పర్సన్)
- ముక్కెర్ల మల్లేష్
- దండబోయిన అనిల్
- అవుల మమత
- తాళ్ళపల్లి నాగరాజు
- బబ్బూరి మౌనిక
2026 ఎన్నికలు
[మార్చు]2026లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో మొత్తం 12 వార్డుల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ 1, బీజేపీ 2, సీపీఐ 1 స్థానాల్లో విజయం సాధించారు.[10][11]
- బి. రాధా (బీజేపీ)

- బూడిద మధు (ఐఎన్‌సీ)

- బరిగె రమ్య రాంచందర్ (ఐఎన్‌సీ)

- కె.స్వప్న ఆంజనేయులు (ఐఎన్‌సీ)

- బిట్టు సరోజ హరీష్ (ఐఎన్‌సీ)

- కె.మాధవి ప్రవీణ్ (బీజేపీ)

- పెల్లిమెల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్ (ఐఎన్‌సీ)

- పెరబోయిన సత్యనారాయణ యాదవ్ (బిఆర్ఎస్)

- సాధునేని ధనలక్ష్మి మధుకర్ (ఐఎన్‌సీ)

- గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ (ఐఎన్‌సీ)

- ముకెర్ల మల్లేష్ యాదవ్ (ఐఎన్‌సీ)

- బబ్బూరి శ్రీధర్ (సీపీఐ)

ఫిబ్రవరి 16న జరిగిన కార్యక్రమంలో యాదగిరిగుట్ట పురపాలక సంఘ ఛైర్ పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ ఛైర్మన్‌గా బరిగె రమ్య ఎన్నికయ్యారు. వీరు ఈ పదవిలో ఐదు సంవత్సరాలు కొనసాగుతారు.[12][13]
మూలాలు
[మార్చు]- ↑ "Yadagirigutta Municipality". yadagiriguttamunicipality.telangana.gov.in. Archived from the original on 7 ఆగస్టు 2020. Retrieved 7 March 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 7 March 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 7 March 2021.
- ↑ "Yadagirigutta Municipality". yadagiriguttamunicipality.telangana.gov.in. Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 7 March 2021.
- ↑ "Basic Information of Municipality, Yadagirigutta Municipality". yadagiriguttamunicipality.telangana.gov.in. Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 7 March 2021.
- ↑ "Council, Yadagirigutta Municipality". yadagiriguttamunicipality.telangana.gov.in. Retrieved 7 March 2021.[permanent dead link]
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 7 March 2021.
- ↑ సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 7 March 2021.
- ↑ skannegari. "Yadagirigutta Municipality into 12 wards - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.
- ↑ "తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు యాదాద్రి జిల్లా - 2026". Eenadu. 15 February 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
- ↑ "యాదాద్రి లోనూ కాంగ్రెస్ దే హవా". V6 Velugu. 14 February 2026. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
- ↑ "ఉమ్మడి నల్గొండలో మేయర్, ఛైర్‌పర్సన్లు వీళ్లే." Eenadu. 16 February 2026. Archived from the original on 16 February 2026. Retrieved 16 February 2026.
- ↑ "తెలంగాణ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక". Zee News Telugu. 16 February 2026. Archived from the original on 16 February 2026. Retrieved 16 February 2026.
వెలుపలి లంకెలు
[మార్చు]- యాదగిరిగుట్ట పురపాలక సంఘ అధికారిక వెబ్‌సైటు Archived 2020-08-07 at the Wayback Machine