Jump to content

భీంగల్ పురపాలకసంఘం

అక్షాంశ రేఖాంశాలు: 18°41′28″N 78°31′14″E / 18.6910461°N 78.5206500°E / 18.6910461; 78.5206500
వికీపీడియా నుండి
భీంగల్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
భీంగల్ పురపాలకసంఘం is located in తెలంగాణ
భీంగల్ పురపాలకసంఘం
భీంగల్ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 18°41′28″N 78°31′14″E / 18.6910461°N 78.5206500°E / 18.6910461; 78.5206500
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాద్
మండలం భీంగల్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ
 - వైస్ చైర్‌పర్సన్‌ భగత్‌
వైశాల్యము
 - మొత్తం 60.82 km² (23.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 15,446
 - పురుషుల సంఖ్య 7,674
 - స్త్రీల సంఖ్య 7,772
 - గృహాల సంఖ్య 4,478
పిన్ కోడ్ - 503307
Area code(s) టెలిఫోన్ కోడ్ - 08463
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

భీంగల్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] భీంగల్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోని బాల్కొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న భీంగల్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం

[మార్చు]

భీంగల్ 15.03 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°42′04″N 78°27′18″E / 18.701°N 78.455°E / 18.701; 78.455 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 183 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం నిజామాబాదు నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 15446 మంది కాగా, అందులో 7674 మంది పురుషులు, 7772 మంది మహిళలు ఉన్నారు. 4478 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 14 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం మల్లెల రాజశ్రీ చైర్‌పర్సన్‌గా, భగత్‌ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
  1. కన్నె ప్రేమలత
  2. లింగాయ ధరవత్
  3. ముత్త లతా
  4. గున్నల బాలభగత్
  5. బొదిరే నర్సయ్య
  6. గంగాధర్ చెప్పల
  7. ఖైరునిస్సా బేగం
  8. సతీష్ గౌడ్ జోగన్ పెల్లీ
  9. మల్లెల రాజశ్రీ
  10. తుమ్మ భూదేవి
  11. షమీమ్ బేగం
  12. మల్లాల అనుపమ

మూలాలు

[మార్చు]
  1. "Bheemgal Municipality". bheemgalmunicipality.telangana.gov.in. Archived from the original on 4 ఆగస్టు 2020. Retrieved 4 May 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 4 May 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 5 May 2021.
  4. "Basic Information of Municipality, Bheemgal Municipality". bheemgalmunicipality.telangana.gov.in. Retrieved 5 May 2021.[permanent dead link]
  5. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 5 May 2021.
  6. admin (2020-05-09). "Bheemgal municipality councillors list 2020". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-22.

వెలుపలి లంకెలు

[మార్చు]