పెద్దపల్లి పురపాలకసంఘం
పెద్దపల్లి పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 18°39′38″N 79°23′30″E / 18.6606268°N 79.3916050°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి |
మండలం | పెద్దపల్లి |
ప్రభుత్వం | |
- చైర్‌పర్సన్ | చిట్టిరెడ్డి మమతారెడ్డి |
- వైస్ చైర్‌పర్సన్ | నజీమా సుల్తానా |
వైశాల్యము | |
- మొత్తం | 26.19 km² (10.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 37,417 |
- పురుషుల సంఖ్య | 18,581 |
- స్త్రీల సంఖ్య | 18,836 |
పిన్ కోడ్ | 505172 |
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ |
పెద్దపల్లి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] పెద్దపల్లి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం లోని పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న పెద్దపల్లి, 2011లో పురపాలక సంఘంగా ఏర్పడింది.
భౌగోళికం
[మార్చు]పెద్దపల్లి 26.19 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°36′54″N 79°22′55″E / 18.615°N 79.382°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 197 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 37417 మంది కాగా, అందులో 18581 మంది పురుషులు, 18836 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 2 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 36 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[3] ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చిట్టిరెడ్డి మమతారెడ్డి చైర్‌పర్సన్‌గా, నజీమా సుల్తానా వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- ఎర్రబోయిన శ్రీనివాస్
- హనుమంతు పస్తం
- లైసెట్ బిక్షపతి
- కొణతం శ్రీనివాస్ రెడ్డి
- చందా రామదేవి
- గీతాంజలి పెద్ది
- కొమిరిశెట్టి కనకలక్ష్మి
- బొంకూరి భాగ్యలక్ష్మి
- ఎరుకల కల్పన
- గేడ్ మాధవి
- పూదారి చంద్రశేఖర్
- నాంసాని సరేష్
- పాగల సోని
- షాహిదా అంజుం
- నెత్తెట్ల స్వరూప
- రాజం మహంతకృష్ణ
- కొలిపాక సంధ్య
- కొలిపాక శ్రీనివాస్
- బెక్కం అంజమ్మ
- రేవెల్లి స్వామి
- చిట్టిరెడ్డి మమతారెడ్డి (చైర్‌పర్సన్)
- స్వరూప ఉప్పు
- తాడూరి పుష్పకళ
- నూగిళ్ళ మల్లయ్య
- కార్తీక్ కనుకూర్తి
- సుద్దమల్ల అమ్రీష్
- సుజాత వునుకొండ
- తుముల సుభాష్ రావు
- ఇల్లందుల కృష్ణమూర్తి
- హబీబా బేగం
- పైడ పద్మ
- పోతాని పురుషోతం
- బూతగడ్డ సంపత్
- మొహమ్మద్ నూర్జహన్
- దేవనంది రమాదేవి
- నజీమా సుల్తానా (వైస్ చైర్‌పర్సన్)
మూలాలు
[మార్చు]- ↑ "Peddapalli Municipality". peddapallimunicipality.telangana.gov.in. Retrieved 7 May 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 7 May 2021.
- ↑ "Council, Peddapalli Municipality". peddapallimunicipality.telangana.gov.in. Retrieved 7 May 2021.
- ↑ The Hindu, Telangana (27 January 2020). "All top posts of municipalities in Karimnagar go to TRS". Archived from the original on 28 January 2020. Retrieved 7 May 2021.
- ↑ skannegari. "Peddapalli Municipality into 36 wards - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.