Jump to content

వనపర్తి పురపాలకసంఘం

వికీపీడియా నుండి

వనపర్తి పురపాలక సంఘము వనపర్తి జిల్లాకు చెందిన 1 పురపాలక సంస్థ ఇది 1984 నుంచి పురపాలక సంఘంగా ఉన్నది. అంతకు క్రితం 1962 నుంచి 1966 వరకు కూడా పురపాలక సంఘంగా ఉండేది. ఆ కాలంలో బాలకృష్ణయ్య పురపాలక సంఘం చైర్మెన్‌గా పనిచేశారు. మేజర్ గ్రామపంచాయతీగా మార్పు చేసిన పిదప కూడా బాలకృష్ణయ్య సర్పంచిగా ఎన్నికయ్యారు. 1983లో ఈయన వనపర్తి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇది మూడవ గ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతోంది.

జనాభా

[మార్చు]

2001 నాటికి పట్టణ జనాభా 50262 కాగా, 2011 నాటికి 60949కు పెరిగింది.

ఆదాయ-వ్యయములు

[మార్చు]

2012-13 నాటికి పురపాలక సంఘం ఆదాయం 7.09 కోట్ల రూపాయలు, ఖర్చు 5.40 కోట్ల రూపాయలు.[1]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-04. Retrieved 2014-03-10.