Jump to content

చొప్పదండి పురపాలకసంఘం

అక్షాంశ రేఖాంశాలు: 18°33′14″N 79°09′58″E / 18.5539591°N 79.1661407°E / 18.5539591; 79.1661407
వికీపీడియా నుండి
చొప్పదండి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
చొప్పదండి పురపాలకసంఘం is located in తెలంగాణ
చొప్పదండి పురపాలకసంఘం
చొప్పదండి పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 18°33′14″N 79°09′58″E / 18.5539591°N 79.1661407°E / 18.5539591; 79.1661407
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండలం చొప్పదండి
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 26 km² (10 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 16,459
 - పురుషుల సంఖ్య 8,269
 - స్త్రీల సంఖ్య 8,190
 - గృహాల సంఖ్య 4,037
పిన్ కోడ్ - 505415
Area code(s) టెలిఫోన్ కోడ్ -0878
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చొప్పదండి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] చొప్పదండి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని చొప్పదండి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న చొప్పదండి, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం

[మార్చు]

చొప్పదండి 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°34′37″N 79°10′01″E / 18.577°N 79.167°E / 18.577; 79.167 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 181 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం కరీంనగర్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 16459 మంది కాగా, అందులో 8269 మంది పురుషులు, 8190 మంది మహిళలు ఉన్నారు. 4037 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 14 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
  1. అశోక్
  2. శ్రీనివాస్
  3. సంధ్య
  4. హేమ
  5. అనిత
  6. గంగరాజు
  7. నీరజ
  8. ప్రణీత
  9. మహేష్
  10. స్వతంత్ర భారతి
  11. మానస
  12. జమున
  13. విజయలక్ష్మి
  14. జ్యోతి

మూలాలు

[మార్చు]
  1. "Choppandandi Municipality". choppandandimunicipality.telangana.gov.in. Retrieved 9 May 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 9 May 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 9 May 2021.
  4. "Basic Information of Municipality, Choppandandi Municipality". choppandandimunicipality.telangana.gov.in. Retrieved 9 May 2021.
  5. The Hindu, Telangana (27 January 2020). "All top posts of municipalities in Karimnagar go to TRS". Archived from the original on 28 January 2020. Retrieved 9 May 2021.
  6. admin (2020-05-10). "Choppadandi municipality Councillors list 2020". Telangana data. Retrieved 9 May 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు

[మార్చు]