Jump to content

బోధన్ పురపాలకసంఘం

అక్షాంశ రేఖాంశాలు: 18°40′N 77°54′E / 18.67°N 77.9°E / 18.67; 77.9
వికీపీడియా నుండి
  ?బోధన్
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°40′N 77°54′E / 18.67°N 77.9°E / 18.67; 77.9
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 21.40 కి.మీ² (8 చ.మై)[1]
జిల్లా (లు) నిజామాబాద్
జనాభా
జనసాంద్రత
77,553[2][3] (2011 నాటికి)
• 3,624/కి.మీ² (9,386/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం బోధన్ పురపాలక సంఘము
కోడులు
పిన్‌కోడ్

• 503185


బోధన్,తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు జిల్లాకు చెందిన పురపాలక సంఘం. బోధన్ పట్టణం నిజామాబాదు జిల్లాలోకెల్లా ప్రసిద్ధమైన పారిశ్రామిక కేంద్రం.వివిధ రకాలైన పంటలు సమృద్ధిగా పండే ఈ ప్రాంతాన్ని పూర్వం బహుధాన్యపురి అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరు బోధన్గా మారి స్థిరపడింది. సుమారు 77వేల జనాభా గల ఈ మున్సిపాలిటీ పట్టణం నిజామాబాదుకు 28 కి. మీ. దూరంలో ఉంది. దక్షిణ మధ్య రైల్వే యొక్క నిజామాబాదు - బోధన్ మార్గం ఇక్కడే అంతమౌతుంది.[4] బోధన్ నగరపాలికను మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు - బోధన్, రాకాసిపేట, శక్కర్ నగర్. ఒకప్పుడు ఆసియాలోనే పెద్దదిగా పేరు పొందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈ పట్టణంలోని శక్కర్ నగర్ లోనే ఉంది.

పురపాలకసంఘం

[మార్చు]

బోధన్ పురపాలక సంఘం 1952 లో స్థాపించిబడింది. దీనిని రెండవ తరగతి పురపాలక సంఘంగా విభజించారు. ఈ పట్టణం మొత్తం 38 వార్డులుగా విభజించబడి ఉంది. దీని అధికార పరిధి 21.40 కి.మీ2 (8.26 చ. మై.).

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,43,749 - పురుషులు 71,022 - స్త్రీలు 72,727

చరిత్ర

[మార్చు]

బోధన్‌ తెలుగువారి అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటికి భారతదేశంలో ఉన్న పదహారు జనపథాల్లో అస్మక ఒకటి. దీని రాజధాని పోతన (బోధన్‌).అంటే రెండువేల ఆరువందల ఏళ్ళ క్రితమే బోధన్‌ ఒక మహానగరంగా ఉందన్నమాట. ఆ కాలం నాటికే అది ప్రసిద్ధ నగరంగా ఉందంటే అంతకు ముందు నుండే అది ఉనికిలో ఉండి ఉండాలి. దాని నిర్మాణానికి, మహానగరంగా అభివృద్ధి చెందటానికి ఎంత దీర్ఘకాలం పట్టిందో ఊహించవచ్చు. అప్పటికి ఎంతో ముందు జీవించాడని భావిస్తున్న బాహుబలికీ అది రాజధానిగా ఉండి ఉండవచ్చు. బోధన్‌ ప్రాంతంలో దొరికిన అనేక జైన విగ్రహాలు అది ఓ జైన కేంద్రంగా విలసిల్లిన వాస్తవాన్ని చెబుతున్నాయి. మౌర్యుల కాలంలో వచ్చిన గ్రీకు దేశస్తుడు మెగస్తనీస్‌ ఆంధ్రులు చుట్టూ గోడలు ఉన్న 30 మహానగరాల్లో నివసించారని తన 'ఇండికా' గ్రంథంలో రాశాడు.

బోధన్ చారిత్రక పట్టణం. పూర్వం ఏకచక్రపురం, బహుధాన్యపురం, బహుధనపురం, పోదన అని వివిధ కాలాల్లో వివిధ పేర్లతో పిలువబడింది. 1056కు చెందిన శిలాశాసనం ఇక్కడ రాష్ట్రకూట రాజు మూడవ ఇంద్రుడు కట్టించిన వైష్ణవాలయాన్ని ప్రస్తావిస్తుంది. పురాతన కోట యొక్క శిథిలాల ఆనవాళ్లు ఇక్కడ నేటికీ కనిపిస్తాయి.పాండవుల కాలములో బోధన్ ఏకచక్రపురంగా పిలవబడేది .బోధన్ లోని రాకాసిపేట, భీముని గుడికి ప్రసిద్ధి . దీనినే స్థానికులు భీముని గుట్టగా పిలుస్తారు.ఇక చరిత్ర లోకి వెళ్తే, ఈ ప్రాంతం లోనే భీముడు బకాసురుణ్ణి వధించాడని ప్రతీతి. దీని ఆనవాళ్ళు ఇప్పటికి ఇక్కడ చూడవచ్చు. చరిత్రయుగం తెలంగాణాలో బౌద్ధంతో ప్రారంభమయింది. బోధన్ శాతవాహనులకు ముందే, శుంగకాణ్వుల కాలంలోనే ప్రసిద్ధమైంది. ఇది అస్మక దేశంలోని ప్రధాన పట్టణాలలో ఒక్కటి. ఇక్కడి నుంచి తెలంగాణా అంతటా బౌద్ధం వ్యాపించింది., బోధన్ లో బవరి అనే విద్వాంసుడు ఉండేవాడు.అతను బుద్ధుని చరిత్రను కర్ణాకర్ణికగా విన్నాడు. బుద్ధుని సత్యమార్గం అతనికి నచ్చడం తో, తన శిషులను బుద్ధునికి దర్శించి, అతని అష్టాంగ మార్గాన్ని అనుసరించి రమ్మని రాజగృహానికి పంపాడు. వారు బుద్ధుని సన్నిధానంలో కొంత కాలం ఉండి, బోధన్ కు తిరిగి వచ్చారు. అప్పుడు బవరి పండితుడు ఆ మార్గాన్ని అనుసరించి, ప్రజలలోకి ప్రచారం చేసాడు.బోధన్ పట్టణం, తర్వాత జైనమతానికి కూడా నిలయమయింది, ఇక్కడి నుంచే జైనం కొలనుపాక మొదలైన ప్రాంతాలకు వ్యాపించింది. బోధన్‌లో గొప్ప గోమటేశ్వర విగ్రహం ఉండేదని, దానిని చూసిన తర్వాతనే హొయసళుల కాలంలో శ్రవణ బెళగొళ గోమటేశ్వర విగ్రహం వెలసిందని అంటారు.

చక్కెర కర్మాగారం

[మార్చు]

ఒకప్పుడు ఆసియాలోనే పెద్దదిగా పేరు పొందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని1992లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నష్టాలు వస్తున్నాయనే అబిప్రాయంతో ఈ ఫ్యాక్టరీని డెల్టా పేపర్ మిల్లుకు విక్రయించింది. ఈ విక్రయాన్ని కార్మికులు, స్ధానిక ప్రజలు వ్యతిరేకించినప్పటికి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ విక్రయంపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన శాసనసభ సభా సంఘం కూడా ఈ ఫ్యాక్టరీని తిరిగి ప్రభుత్వ పరం చేయాలని సిఫార్శు చేసింది. దీనిని కొనుగోలు చేసిన గోకరాజు గంగరాజు అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ నివేదిక ఇచ్చింది. ప్రైవేట్ యాజమాన్యంతో కార్మికులు, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రైవేట్ యాజమాన్యం వి.వి.ఆర్.కృష్ణంరాజు అనే మేనేజ్ మెంట్ ఎగ్జిక్యుటీవ్ ను నియమించింది. మూడున్నరేళ్ళపాటు ఆయన వివాదాల పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నించారు. అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. ఆయన రాజీనామా చేసిన తర్వాత అక్కడ పాత సమస్యలు మళ్ళీ తలెత్తాయి. ఒకప్పుడు ఆరు లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేసిన ఈ ఫ్యాక్టరీ 2009 సీజన్ లో కేవలం 60 వేల టన్నుల చెరకును మాత్రమే క్రష్ చేయగలిగింది.

మూలాలు

[మార్చు]
  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  2. "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 11, 36. Retrieved 11 June 2016.
  3. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 25 July 2014.
  4. Encyclopaedia of Tourism: Resources in India By Manohar Sajnani

వెలుపలి లంకెలు

[మార్చు]