నిజాం షుగర్ ఫ్యాక్టరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిజాం షుగర్ ఫ్యాక్టరీ
స్థాపన1937
స్థాపకుడుమీర్ ఉస్మాన్ అలీ ఖాన్
ఉత్పత్తులుచక్కెర

నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, బోధన్ లో ఉన్న చక్కెర కర్మాగారం.[1][2] 1937లో ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ కర్మాగారం ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా నిలిచింది నిర్మించబడినప్పుడు.[3]

చరిత్ర

[మార్చు]

1937లో హైదరాబాద్ రాజ్యం ఏడవ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ పర్యవేక్షణలో దాదాపు 15వేల ఎకరాల్లో ఈ కర్మాగారం నిర్మించబడింది. సుమారు 80 సంవత్సరాల క్రితం నిజాంలు స్థాపించిన ఈ కర్మాగారం మంచి లాభాలను ఆర్జించింది.[4] తరువాతి కాలంలో భారీ నష్టాలకు గురైంది. దానికారణంగా 2002 లో ఈ కర్మాగారాన్ని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరించారు. దాన్ని తప్పు బట్టిన వై.యస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని పట్టించుకోలేదు. 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుని పునరుద్ధరిస్తుందని హామీ ఇచ్చాడు.[5]

ఇతర వివరాలు

[మార్చు]

2015 నాటికి రాష్ట్ర ప్రభుత్వం 49 శాతం కర్మాగారాన్ని కలిగిఉండగా, డెల్టా షుగర్స్ మిగిలిన వాటాను కలిగి ఉంది. 2015లో కర్మాగారాన్ని పూర్తిగా ప్రభుత్వానికి అప్పగిస్తామని పేర్కొన్నారు.[6]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Auction of Nizam sugar factory lands begins". The Hindu. 26 April 2001. Archived from the original on 6 మే 2002. Retrieved 10 August 2019.
  2. "Nizam sugar factory, Reason behind downfall, Revealed?". TelanganaNewsPaper.com. 27 December 2016. Archived from the original on 20 జూన్ 2017. Retrieved 10 ఆగస్టు 2019.
  3. "Telangana government takes over Nizam Sugar Factory". Business Standard India. 29 April 2015.
  4. "Government may take over Nizam Sugars". The Hindu. 18 January 2014.
  5. "Telangana government takes over Nizam Sugar Factory". Business Standard India. 29 April 2015.
  6. "Telangana govt to take control of Nizam Sugar factory".