రాయికల్ పురపాలకసంఘం
రాయికల్ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 18°58′10″N 78°51′39″E / 18.9694452°N 78.8609122°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జగిత్యాల |
మండలం | రాయికల్ |
ప్రభుత్వం | |
- చైర్‌పర్సన్ | సంగి సత్తమ్మ |
- వైస్ చైర్‌పర్సన్ | ఇందారపు రామయ్య |
వైశాల్యము | |
- మొత్తం | 18.06 km² (7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 11,911 |
- పురుషుల సంఖ్య | 5,660 |
- స్త్రీల సంఖ్య | 6,251 |
పిన్ కోడ్ - 505460 | |
Area code(s) | టెలిఫోన్ కోడ్ -08724 |
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్ |
రాయికల్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] రాయికల్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోని జగిత్యాల శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న రాయికల్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
[మార్చు]రాయికల్ 18.06 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°54′18″N 78°48′43″E / 18.905°N 78.812°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 212 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం జగిత్యాల నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 11911 మంది కాగా, అందులో 5660 మంది పురుషులు, 6251 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం మోర హనుమాండ్లు చైర్‌పర్సన్‌గా, గండ్ర రమాదేవి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6][7] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- గండ్ర రమాదేవి (వైస్ చైర్‌పర్సన్)
- కన్నాక మహేందర్
- మరంపెల్లి సాయిబాబు
- తురగ శ్రీధర్ రెడ్డి
- వల్లంకొండ మహేష్
- అన్వారీ బేగం
- అనుమల్ల దివ్య
- కల్లెడ సునీత
- శ్రీరాముల సువర్ణ
- మ్యాకల కాంతరావు
- మ్యాకల అనురాధ
- మోర హనుమాండ్లు (చైర్‌పర్సన్)
మూలాలు
[మార్చు]- ↑ "Raikal Municipality". raikalmunicipality.telangana.gov.in. Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 8 May 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 8 May 2021.
- ↑ skannegari. "Raikal Municipality election to 12 wards - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 10 మే 2021. Retrieved 8 May 2021.
- ↑ The Hindu, Telangana (27 January 2020). "All top posts of municipalities in Karimnagar go to TRS". Archived from the original on 28 January 2020. Retrieved 8 May 2021.
- ↑ admin (2020-05-15). "Raikal municipality Councillors list 2020". Telangana data. Retrieved 8 May 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 12 May 2021.
వెలుపలి లంకెలు
[మార్చు]- రాయికల్ పురపాలక సంఘ అధికారిక వెబ్‌సైటు Archived 2021-05-08 at the Wayback Machine