కల్వకుర్తి పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్వకుర్తి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
కల్వకుర్తి పురపాలకసంఘం is located in తెలంగాణ
కల్వకుర్తి పురపాలకసంఘం
కల్వకుర్తి పురపాలకసంఘం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°42′55″N 78°38′03″E / 16.7151396°N 78.6341996°E / 16.7151396; 78.6341996
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్
మండలం కల్వకుర్తి
ప్రభుత్వము
 - చైర్‌పర్సన్‌ ఎడ్మ సత్యంరెడ్డి
 - వైస్ చైర్‌పర్సన్‌ షాహీద్
వైశాల్యము
 - మొత్తం 9.00 km² (3.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 14,617
 - స్త్రీల సంఖ్య 13,493
 - గృహాల సంఖ్య 6,624
పిన్ కోడ్ - 509324
Area code(s) ఎస్.టి.డి కోడ్ - 08549
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

కల్వకుర్తి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] కల్వకుర్తి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం లోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న కల్వకుర్తి 2013 మార్చి 22న పురపాలక సంఘంగా ఏర్పడింది.

భౌగోళికం[మార్చు]

కల్వకుర్తి 9.00 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16°40′05″N 78°29′24″E / 16.668°N 78.490°E / 16.668; 78.490 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 80 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం నాగర్‌కర్నూల్ నుండి 31 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 28110 మంది కాగా, అందులో 14617 మంది పురుషులు, 13493 మంది మహిళలు ఉన్నారు. 6624 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 25 రెవెన్యూ వార్డుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 22 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం ఎడ్మ సత్యంరెడ్డి చైర్‌పర్సన్‌గా, షాహీద్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. బనావత్ బాలు
  2. యాదమ్మ
  3. సూర్యప్రకాష్ రావు
  4. పట్లవత్ ఉమ్లి
  5. రవీందర్
  6. విజయలక్ష్మి
  7. శ్రీనివాసులు
  8. గోపిరెడ్డి లక్ష్మి
  9. ఎడ్ల సత్యంరెడ్డి
  10. షాహీన్ బేగం
  11. చైతన్య రెడ్డి
  12. మంజుల
  13. సౌజన్య రెడ్డి
  14. మంజుల
  15. రజియా బేగం
  16. శ్రీశైలం
  17. ఎజాస్
  18. చందన
  19. షాహీద్
  20. పద్మ
  21. సైదు బాబు
  22. బోజిరెడ్డి

మూలాలు[మార్చు]

  1. "Kalwakurthy Municipality". kalwakurthymunicipality.telangana.gov.in. Retrieved 11 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 11 April 2021.
  3. "Basic Information of Municipality, Kalwakurthy Municipality". kalwakurthymunicipality.telangana.gov.in. Retrieved 11 April 2021.
  4. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 11 April 2021.
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 11 April 2021.
  6. admin (2020-05-17). "Kalwakurthy Municipality Councillors list 2020". Telangana data. Retrieved 2021-05-18.

వెలుపలి లంకెలు[మార్చు]