నకిరేకల్ మండలం
నకిరేకల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నకిరేకల్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°10′00″N 79°26′00″E / 17.166667°N 79.433333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | నకిరేకల్ |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 152 km² (58.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 60,758 |
- పురుషులు | 30,326 |
- స్త్రీలు | 30,432 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 65.40% |
- పురుషులు | 76.55% |
- స్త్రీలు | 53.95% |
పిన్‌కోడ్ | 508211 |
నకిరేకల్ మండలం మండలం,తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మండలం.[1]
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం నకిరేకల్.
గణాంకాలు[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం మండలం మొత్తం జనాభా 60,758. వీరిలో 30,326 మంది పురుషులు కాగా, 30,432 మంది స్త్రీలు. 2011లో నక్రేకల్ మండలంలో మొత్తం 15,588 కుటుంబాలు ఉన్నాయి. మండలం సగటు లింగ నిష్పత్తి 1,003. మొత్తం జనాభాలో 47.9% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 52.1% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 80% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 60.6% గా ఉంది. అలాగే మండలంలో పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 1,030 కాగా, గ్రామీణ ప్రాంతాల వారిది 979. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6086, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 3129, ఆడ పిల్లలు 2957 ఉన్నారు. మండలం బాలల లింగ నిష్పత్తి 945, ఇది మండల సగటు లింగ నిష్పత్తి (1,003) కంటే తక్కువ. మొత్తం అక్షరాస్యత రేటు 69.97%. మండలంలో పురుషుల అక్షరాస్యత రేటు 71.09%, స్త్రీల అక్షరాస్యత రేటు 54.87%.[3]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 152 చ.కి.మీ. కాగా, జనాభా 60,758. జనాభాలో పురుషులు 30,326 కాగా, స్త్రీల సంఖ్య 30,432. మండలంలో 15,588 గృహాలున్నాయి.[4]
మండల విశేషాలు[మార్చు]
- ఎవరెస్టు శిఖరం అధిరోహించిన శేఖర్ బాబు ఈ మండలానికి చెందిన మొదటి తెలుగువాడు.
- నకిరేకల్ సాయి సేవాశ్రమ సంస్థానం ట్రస్ట్ వారిచే గ్రామంలో అతి పెద్దషిర్డీ సాయిబాబా మందిరం నకిరేకల్ గ్రామంలో నిర్మింపబడింది.
- నకిరేకల్‌లో ఒక ఇండోర్ స్టేడియం ఉంది.
- డి లిమిటేషన్ తరువాత రాష్ట్రంలో నకరేకల్ శాసనసభ నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం.
- ఇక్కడి నుండి అడ్లూరు సరస్వతీ మందిరం 14 కి.మీ. దూరంలో ఉంది.
- రాణి రుద్రమదేవి మండల పరిధిలోని చందుపట్ల గ్రామంలో ప్రాణాలు విడిచింది. గుర్తుగా సమాధి నెలకొల్పడం జరిగింది.
- మూసీ నది ప్రాజెక్టు కూడా 14 కి.మీ. దూరంలో ఉంది.
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- ఒగోడు
- వల్లభాపూర్
- పాలెం
- నోముల
- కడపర్తి
- అడవిబొల్లారం
- చందంపల్లి
- నెల్లిబండ
- నకిరేకల్
- తాటికల్
- తెట్టెకుంట
- మంగలిపల్లి
- చందుపట్ల
- మర్రూర్
- గొరెంకల్‌పల్లి
- మండలపూర్
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 245, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "Nakrekal Mandal Population, Religion, Caste Nalgonda district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-07-30.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.