గట్టుప్పల్ మండలం
గట్టుప్పల్ తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నల్లగొండ రెవిన్యూ డివిజన్ పరిథిలోని మండల కేంద్రం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జులై 23న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి[1], ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబర్ 26న 09 గ్రామాలతో నూతనంగా గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[2][3]
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మండలాల పునర్విభజనలో భాగంగా గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించిన ప్రభుత్వం తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ప్రత్యేక మండలం కోసం 892 రోజుల పాటు గ్రామస్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.[4]
మండలంలోని గ్రామాలూ[మార్చు]
గట్టుప్పల్ మండలంలో మొత్తం 9 గ్రామ పంచాయతీలతో ఏర్పాటైంది. చండూరు మండలం నుండి కొండాపురం, తేరట్‌పల్లి, గట్టుప్పల్, సిర్దేపల్లి, కుమందానిగూడ, మర్రిగూడ మండలం నుండి నామాపూర్, అంతంపేట, సోమరాజుగూడా, మునుగోడు మండలం నుండి వెలమకన్నె గ్రామాలను కలిపి మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5]
గ్రామాల జాబితా[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Disha (23 July 2022). "కల సాకారం..ఫలించిన గట్టుపల్ మండల సాధన సమితి పోరాటం". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Nalgonda District (22 July 2022). (PDF) https://web.archive.org/web/20220930065200/https://cdn.s3waas.gov.in/s374071a673307ca7459bcf75fbd024e09/uploads/2022/07/2022072357.pdf. Archived from the original (PDF) on 30 September 2022. Retrieved 30 September 2022.
{{cite news}}
: Missing or empty|title=
(help)