నిడమనూరు మండలం (నల్గొండ జిల్లా)
నిడమనూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]
| నిడమనూరు | |
| — మండలం — | |
| అక్షాంశరేఖాంశాలు: 16°52′22″N 79°21′10″E / 16.87289°N 79.352646°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | నల్గొండ జిల్లా |
| మండల కేంద్రం | నిడమనూరు (నల్గొండ జిల్లా) |
| గ్రామాలు | 15 |
| ప్రభుత్వం | |
| - మండలాధ్యక్షుడు | |
| వైశాల్యము | |
| - మొత్తం | 217 km² (83.8 sq mi) |
| జనాభా (2011) | |
| - మొత్తం | 53,816 |
| - పురుషులు | 27,233 |
| - స్త్రీలు | 26,583 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 55.15% |
| - పురుషులు | 67.11% |
| - స్త్రీలు | 42.72% |
| పిన్‌కోడ్ | 508278 |
ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 23 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం నిడమానూరు.
నిడమనూరు ఎప్పుడు అభివృద్ధి వివక్షతోనే ఉంది. చెప్పుకోదగ్గ అభివృద్ధి నిడమనూరు లో జరగలేదు, ఒక్క పట్టణం లోన్ 10 వేలకు పైగా జనాభా సంఖ్య ఉన్న లింక్ రోడ్లు కనెక్టివిటీ లేక నిడమనూరు ఆగం అయింది.[1]
గణాంకాలు
[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 53,816 - పురుషులు 27,233 - స్త్రీలు 26,583
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 217 చ.కి.మీ. కాగా, జనాభా 43,848. జనాభాలో పురుషులు 22,088 కాగా, స్త్రీల సంఖ్య 21,760. మండలంలో 11,421 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మార్పాక
- ఎర్రబల్లి
- వూటుకూరు
- నిడమనూరు
- ముప్పారం
- గుంటిపల్లి
- వేంపహాడ్
- శాఖాపూర్
- బంకాపూర్
- సూరేపల్లి
- వెనిగండ్ల
- తుమ్మడం
- వల్లభాపూర్
- బొక్కమంతులపహాడ్
- రేగులగడ్డ
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
