మూసీ ప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాలకుల సవతి తల్లి ప్రేమ కారణంగా మూసీ ప్రాజెక్టు ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టునిండా నీరు వున్నా రైతులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. రైతులు బావులు, బోర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు నిర్మించి 50 సంవత్సరాలు దాటినా నేటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ 50 సంవత్సరాలలో ఏనాడూ ఈ ప్రాజెక్టును ఆధునీకరించడానికి ప్రయత్నించిన పాపాన పాలకులు పోలేదు. ఈ కాలంలో పూడికతో ప్రాజెక్టు పూడిపోయి దానికిఉన్న నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్‌ తరువాత పేరొందింది మూసీ ప్రాజెక్టు. తుంగతుర్తి, సూర్యాపేట, నకిరేకల్‌, (తాలూకాల) ప్రాంతాల నడుమ 1954-1963 మధ్య కాలంలో నిర్మించిన ఒక మంచి ప్రాజెక్టు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌ ప్రాంతంలో అనంతగిరి కొండల నడుమ మొదలై హైదరాబాద్‌ నుండి ప్రవహిస్తూ 240 కి.మీ ప్రయాణించి కృష్ణానదిలో వాడపల్లి వద్ద కలుస్తుంది. ఆలేరు, పాలేరు, ఎస వాగులే ఈ మూసీ నదికి ప్రధాన ఆధారం. మూసీ నదిపై 190 కి.మీ వద్ద సోలిపేట గ్రామ సమీపాన మూసీ ప్రాజెక్టును నిర్మించారు. అందుకే దీనిని సోలిపేట ప్రాజెక్టు అని కూడా పిలుస్తారు. ఇది 5.5 టి.ఎం.సీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉన్నది. ప్రాజెక్టు మునిగిన ఏరియా 6245 ఎకరాలు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగయ్యే విస్తీర్ణం 30,000 ఎకరాలు (కుడి కాల్వ క్రింద 14770, ఎడమ కాల్వ క్రింద 15230). మూసీ నది పొడవునా బోరు, బావులు, చెరువుల ద్వారా దాదాపు 60 వేల ఎకరాల భూమి సాగుఅవుతున్నది. కుడి కాల్వ పొడవు 33.80 కి.మీ, ఎడమ కాల్వ పొడవు 41.75 కి.మీ ఈ రెండు కాల్వల ద్వారా సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్‌, నకిరేకల్‌, తిప్పర్తి, వేములపల్లి తదితర మండలాలలోని గ్రామాలకు సాగు నీరు, సూర్యాపేటకి మంచినీరు కూడా అందుతుంది.పాలకుల సవతి తల్లి ప్రేమ కారణంగా మూసీ ప్రాజెక్టు ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టునిండా నీరు వున్నా రైతులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. రైతులు బావులు, బోర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు నిర్మించి 50 సంవత్సరాలు దాటినా నేటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ 50 సంవత్సరాలలో ఏనాడూ ఈ ప్రాజెక్టును ఆధునీకరించడానికి ప్రయత్నించిన పాపాన పాలకులు పోలేదు. ఈ కాలంలో పూడికతో ప్రాజెక్టు పూడిపోయి దానికిఉన్న నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. కాల్వల పరిస్థితి వేరే చెప్పనవసరం లేదు. కాల్వలలో ఏనాడూ పూడిక తీయకపోవడంతో 320 క్యూసెక్కుల నీటిని అందించాల్సిన కాల్వలలో ఇప్పుడు సగం కూడా నీరు ప్రవహించటం లేదు. కుడి కాల్వకు సంబంధించి 58 డిస్ట్రిబ్యూటరీస్‌, ఎడమ కాల్వకు సంబంధించి 59 డిస్ట్రిబ్యూటరీస్‌ వుండగా 60 డిస్ట్రిబ్యూటరీస్‌కు సంబంధించిన షట్టర్స్‌ పూర్తిగా లేకుండా పోయాయి. ఫలితంగా కాలువ చివరి భూములకు నీరందడం గగనకుసుమంగా మారింది. సబ్‌ కెనాల్స్‌ కొన్ని చోట్ల పూడిపోయి, మరికొన్నిచోట్ల ఆక్రమణకు దీంతో బోర్లు, బావులే గతి అవుతున్నాయి. ఈ రకంగా మొత్తం విస్తీర్ణంలో దాదాపు 30 శాతం విస్తీర్ణానికి నీరు అందడం లేదు. కుడి, ఎడమ కాల్వల పొడవు దాదాపు 75 కి.మీ పొడవున సుమారు 100 ఎకరాల భూమి భూ ఆక్రమణదారుల కబందాస్తాలలోకి వెళ్లింది. ప్రాజెక్టు ఏర్పడినప్పుడు డ్యామ్‌పై పర్యవేక్షణకు నియమించిన ఉద్యోగులు 32 మంది ఉండగా ప్రస్తుతం 11 మంది ఉన్నారు. కాల్వల పర్యవేక్షణకు సంబంధించి 48 మంది గ్యాంగ్‌మెన్స్‌ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 20 మందే ఉన్నారు. దీన్నిబట్టి పాలకులకు సాగునీటిపై ఎంత శ్రద్ధ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మూసీ ప్రాజెక్టు 12 క్రెస్టు గేట్లు, 8 రెగ్యులేటరీ గేట్లు, 10 సిల్ట్‌ గేట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. కాని ఈ మూడు రకాల గేట్లుకూడా పూర్తి స్థాయిలో ఉపయోగంలో లేవు. క్రెస్టు గేట్లు, రెగ్యూలేటరీ గేట్లు చెడిపోయిన కారణంగా అనేక సందర్భాలలో లీకేజీల వల్ల మూసీనదిలోని నీరు సముద్రంపాలవుతోంది. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. నేటికీ ప్రతి సంవత్సరం దాదాపు ఒక టిఎంసీ నీరు వృధాగా పోతున్నది. దీనికి తోడు ప్రాజెక్టులో ఇసుకమేటను తొలగించుట కోసం ఏర్పాటు చేసిన సిల్ట్‌ గేట్లు గతంలో నీటి వత్తిడికి కొట్టుకుపోయినప్పుడు వాటిని మరమ్మత్తు చేయడానికి బదులు సిమెంట్‌తో శాశ్వతంగా మూసివేశారు. ఫలితంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామాన్ని మూసీ ఆయకట్టు కింద చూపించకుండా, కాసరబాద గ్రామం అవతల ఉన్న సర్కీల్‌పేట రెవెన్యూ గ్రామాన్ని ఆయకట్టు పరిధిలో చూపించారు. దీనిపై రైతులు అనేక ఆందోళనలు చేసినా నేటికీ కాసరబాద గ్రామాన్ని ఆయకట్టు పరిధిలోకి తీసుకోలేదు. ఫలితంగా పక్కనే మూసీ పొంగిపొర్లుతున్నా కాసరబాద రైతులకు మాత్రం నీరందడం లేదు. గత 55 సంవత్సరాలలో 10 నుండి 15 సంవత్సరాలు మినహా మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎప్పుడూ నిండిన దాఖలాలు లేవు. అనేక సందర్భాలలో తక్‌బంధి పద్ధతులలో సాగునీరు అందించారు. హైదరాబాద్‌, భువనగిరి పరిసర ప్రాంతాలలో వర్షాలు బాగా కురిసినప్పుడు మాత్రమే మూసీ ప్రాజెక్టు నిండుతుంది. మూసీ ప్రాజెక్టు నిండడానికి ప్రత్యామ్నాయంగా ఉదయ సముద్రం నుండి కనీసం 2 టిఎంసీల నీటిని మూసీ ప్రాజెక్టులోకి పంపడం ద్వారా ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కార మార్గం సాధించవచ్చు. దీనికి అదనంగా కాల్వలు తీయనవసరం లేదు. పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. కానీ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే సరిపోతుంది. ఒకప్పుడు స్వచ్ఛంగావున్న మూసీ ఇప్పుడు కాలుష్య మయమైపోయింది. మూసీ మొదలైన దగ్గర నుండి దాదాపు 240 కి.మీ పొడవున అనేక పారిశ్రామిక కేంద్రాలనుఏర్పాటు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ కలుషిత నీటిని త్రాగి అనేక సందర్భాలలో పశువులు చనిపోయిన సందర్భాలున్నాయి. వ్యవసాయానికి ఈ నీటిని వినియోగించడం వల్ల పంటల నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఈ నీటి వల్ల చెరువులలో పెంచుతున్న చేపలు చనిపోతుండడంతో మత్స్యకార్మికులు నష్టపోతున్నారు.