అక్షాంశ రేఖాంశాలు: 17°09′48″N 79°25′32″E / 17.163266°N 79.425671°E / 17.163266; 79.425671

నకిరేకల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నకిరేకల్
—  రెవెన్యూ గ్రామం  —
నకిరేకల్ is located in తెలంగాణ
నకిరేకల్
నకిరేకల్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°09′48″N 79°25′32″E / 17.163266°N 79.425671°E / 17.163266; 79.425671
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం నకిరేకల్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 508211
ఎస్.టి.డి కోడ్

నకిరేకల్, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నకిరేకల్ మండలానికి చెందిన గ్రామం.[1] ఇది 65వ నంబరు జాతీయ రహదారి మీద హైదరాబాద్ నుండి 110 కి.మీ.ల దూరంలో, నల్గొండ నుండి 20 కి. మీ.ల దూరంలో ఉంది. ఇది నకిరేకల్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

గణాంకాలు

[మార్చు]
దస్త్రం:AP village Nakirekal 1.JPG
నకిరేకల్ తాసిల్దారు కార్యాలయం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 60,758 - పురుషులు 30,326 - స్త్రీలు 30,432

సమీప పట్టణాలు

[మార్చు]

సూర్యాపేట, నార్కెట్‌పల్లి, నల్గొండ, మిరియాలగూడ

చరిత్ర

[మార్చు]

నియోలితిక్ కాలానికి చెందిన వడిసెల రాళ్ళు, ఇతర వస్తువులు "చోట యెలుపు" అనే చోట బయటపడినాయి. మెగాలితిక్ కాలానికి చెందిన సమాధి స్థలాలు, ఇతర వస్తువులు తిప్పర్తి, నకిరేకల్, నల్గొండల వద్ద బయటపడినాయి.వసంతరాయని క్రీడాభిరామము అనే గ్రంథంలో రచయిత ఈ వూరిని "నాగరికల్లు" అని ప్రస్తావించాడు.

రవాణా

[మార్చు]
దస్త్రం:AP village Nakirekal 3.JPG
నకిరేకల్ టౌన్ సెంటర్

ఈ పట్టణంలో ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్ స్టేషను ఉంది. జాతీయరహదారి కనుక ఇతర ప్రాంతాలకు బస్సు ప్రయాణమే ముఖ్యసాధనం. వూరి లోపల ప్రయాణాలకు మోటారు సైకిళ్ళు, ఆటోలు వాడుతుంటారు. సైకిళ్ళ వినియోగం తగ్గుముఖం పట్టింది.

వ్యాపార, విద్యా కూడలి

[మార్చు]

చుట్టు ప్రక్కల గ్రామాలకు ఇది విద్యా కేంద్రం.వినియోగదారులకు అవసరమైన వ్యవసాయ సామగ్రి, పంపుసెట్లు, నిత్యావసర సరుకులు వంటివాటికి ఇది వ్యాపార కేంద్రం.

రాజకీయాలు

[మార్చు]

చాలా కాలంగా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీలకు మంచి బలం ఉంది. భారతీయ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు ఇక్కడ అనేకమార్లు విజయం సాధించారు. తెలంగాణా సాయుధ పోరాటం సమయంలో ఉద్యమాలలో పాల్గొన్న నంద్యాల శ్రీనివాసరెడ్డి వంటి నాయకుల కారణంగా ఇక్కడ కమ్యూనిస్టు పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. సుమారు 30 సంవత్సరాల కాలం కమ్యూనిస్టి పార్టీ తరపున నర్రా రాఘవరెడ్డి శాసనసభ ప్రతినిధిగా ఎన్నికయ్యాడు. 1972లో భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన మూసపాటి కమలమ్మ, 2009లో టి. లింగయ్య ఎన్నికయ్యారు. 2009 ఎన్నికలనాటికి ఈ నియోజకవర్గంలో వోట్ల సంఖ్య 2,21,453. ప్రస్తుతం ఇది ఎస్.సి.లకు రిజర్వు చేయబడిన నియోజకవర్గంగా ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

నకిరేకల్లులో అనేక పాఠశాలలు, కాలేజీలు ఉన్నాయి. వాసవి, ఎ.వి.ఎమ్., అరుణోదయ, మల్లికార్జున వంటి పేరు పొందిన విద్యాసంస్థలు. ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో సెయింట్ యాన్స్ స్కూలు ప్రసిద్ధం. ఇటీవల కాకతీయ విశ్వవిద్యాలయం అధ్వర్యంలో ఎ.వి.ఎమ్. కాలేజి దూరవిద్యాసదుపాయాలను నెలకొలిపింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. నమస్తే తెలంగాణ, తెలంగాణ (3 May 2021). "జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్, అచ్చంపేట‌ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం". Namasthe Telangana. Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
  3. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నకిరేకల్&oldid=4331014" నుండి వెలికితీశారు