Jump to content

బీరంగూడ

వికీపీడియా నుండి

బీరంగూడ (Beeramguda) తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, అమీనుపూర్ జనగణన పట్టణ పరిధిలో ఉంది.[1]ఇక్కడ బీరంగూడ గుట్ట అనే కొండప్రాంతం మీద వున్న శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద దేవస్థానం
బీరంగూడ కమాన్
శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం

ముఖ్య విషయాలు 

[మార్చు]

బీరంగూడకు బస్సు ద్వారా ప్రయాణించవచ్చు. దగ్గర్లోని బస్సు స్టాపు బీరంగూడ కమాన్ వద్ద అది. దగ్గరలోని రైల్వే స్టేషన్ చందా నగర్, శేరిలింగంపల్లిలో ఉన్నాయి. సమీపంలో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది 

బీరంగూడ కొన్ని సంవత్సరాలుగా బాగా అభివృద్ధి చెందింది. దీని వళ్ళ అక్కడ ఇళ్ల నిర్మాణం, భూ విక్రయ పరిశ్రమ బాగా వికసించింది. దీనికి ముఖ్య కారణం హైదరాబాద్ ఐ.టి పరిశ్రమ అభివృద్ధి చెందిన కారణంగా చేపుపుకోవచ్చు

బీరంగూడ వద్ద ఒక సరస్సు కూడా వుంది. ఇక్కడ ప్రభుత్వం అమీన్ పూర్ పురపాలక సంఘం ద్వారా సుందరీకరణ పనులు చేపట్టారు. సరస్సు ఒడ్డున చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. బీరంగూడ పరిసరప్రాంతాలలో సాధారణమైన గుట్ట ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తాయి.

పర్యాటక ప్రదేశాలు.

[మార్చు]

భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, వేణు గోపాల స్వామి దేవాలయం అన్నీ బీరంగూడ లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రారంభంలో శివరాత్రి ఉత్సవాలలో బాగా ప్రసిద్ధి చెందిన మొదటి ఆలయంలో జరుపుతారు . బీరాంగుడా సరస్సు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంది. 

దగ్గరలోని ప్రదేశాలు 

[మార్చు]

పటాన్ చెరు, శేరిలింగంపల్లి, చందా నగర్ దగ్గర లోని ముఖ్య పట్టణాలు. ఇస్నాపూర్, కిష్టారెడ్డిపేట్, సుల్తాన్పూర్ దగ్గర లోని గ్రామాలు. అశోక్ నగర్, కాకతీయ నగర్, భవనపురం, షిర్డీ సాయి కాలనీ, కిషార్ రెడ్డిపేట్, రామచంద్రరెడ్డి కాలనీలు చుట్టూరు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Ameenpur Municipality". ameenpurmunicipality.telangana.gov.in. Archived from the original on 2020-10-31. Retrieved 2020-12-30.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బీరంగూడ&oldid=4087790" నుండి వెలికితీశారు