అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అచ్చంపేట, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా,అచ్చంపేట మండలానికి చెందిన జనగణన పట్టణం,[1] 2013 జూన్ 25న అచ్చంపేట పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

ఉమామహేశ్వరాలయం

ఈ పట్టణం నల్లమల అడవులకు సమీపంలో ఉంది. హైదరాబాదు, శ్రీశైలం, మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణం అభివృద్ధిలో ఉంది. బస్సు డిపో కూడా ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.

చరిత్ర[మార్చు]

ఈ ప్రాంతాన్ని పరిపాలించిన దేవినేని అచ్చమ్మ దొరసాని ఈ పట్టణాన్ని ఏర్పరిచింది కాబట్టి ఆమె పేరుమీదుగా ఇది అచ్చంపేట అయిందని కొందరు చరిత్రకారుల భావన. ఐతే18వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అలంపూరు బిజ్జల పాలక వంశానికి చెందని అచ్చమ్మ స్థాపించిందనీ, ఆమె పేరుమీదుగా అచ్చంపేట అయిందని కొందరు చరిత్రకారులు చెప్తారు. దేవినేని అచ్చమ్మ దొరసాని గ్రామాన్ని నెలకొల్పినట్టు పేర్కొనే శాసనం ఒకటి ఉమామహేశ్వరంలో లభిస్తోంది.[3]

పరిపాలన[మార్చు]

గ్రామంలో 1898లో మునసబు ఆఫీసు, 1939లో తహశ్శీలు ఆఫీసు ఏర్పడ్డాయి. దీనితో 1939లోనే తాలూకా కేంద్రమైంది.[3]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం - 28384, గ్రామీణ జనాభా 40504.పిన్ కోడ్ నం. 509375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.

విద్యాసంస్థలు[మార్చు]

 • ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
 • ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
 • త్రివేణి జూనియర్ కళాశాల (స్థాపన:1992-93)
 • ప్రగతి జూనియర్ కళాశాల (స్థాపన:2002-03)
 • ప్రగతి డిగ్రీ కళాశాల
 • తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (స్థాపన:1996-97), ఫోను నెం:08541-272040

పర్యాటక ప్రదేశాలు[మార్చు]

 • ఉమామహేశ్వరము. (శ్రీశైలం ఉత్తర ద్వారము)
 • మల్లెలతీర్థం: శ్రీశైలం వెళ్ళేదారిలో వటవర్లపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉంటుంది.
 • లొద్ది మల్లయ్య స్వామి దేవాలయం.
 • సలేశ్వరం: తెలంగాణా అమరనాథ్‌గా పిలవబడుతుంది. ప్రత్యేకమైన ఉత్సవాల రోజుల్లో మాత్రమే ఇక్కడికి ప్రజలు వస్తుంటారు.
 • ఫరహాబాద్ దృశ్య కేంద్రం: నల్లమల్ల అడవుల్లోనుండి కృష్ణానది సౌందర్యాన్ని చూడటానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఒక ప్రదేశం.
 • మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం
 • అక్కమహాదేవి గుహలు
 • శ్రీ సాయిబాబా మందిరం:అవతారమూర్తిగా భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్న శ్రీ సాయిబాబా మందిరం, ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరంగా పేరుగాంచింది.

నీటిపారుదల భూమి[మార్చు]

2337 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[4].

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nagarkurnool.pdf
 2. "Basic Information of Municipality, Atchampet Municipality". atchampetmunicipality.telangana.gov.in. Retrieved 12 April 2021.
 3. 3.0 3.1 లింగమూర్తి, కపిలవాయి (1992). పాలమూరు జిల్లా ఆలయాలు. 17.
 4. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79

బయటి లింకులు[మార్చు]

[3] ఈనాడు తీర్ధయాత్ర, నవంబరు,2013. 10వ పేజీ.