Coordinates: 16°33′01″N 78°10′45″E / 16.5502768°N 78.1792434°E / 16.5502768; 78.1792434

వట్టెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వట్టెం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలంలోని గ్రామం.[1]

వట్టెం
—  రెవిన్యూ గ్రామం  —
వట్టెం is located in తెలంగాణ
వట్టెం
వట్టెం
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°33′01″N 78°10′45″E / 16.5502768°N 78.1792434°E / 16.5502768; 78.1792434
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్
మండలం బిజినపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,918
 - పురుషుల సంఖ్య 2,450
 - స్త్రీల సంఖ్య 2,468
 - గృహాల సంఖ్య 1,043
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన బిజినపల్లి నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నాగర్‌కర్నూల్ కి 19 కి. మీ ల దూరం వనపర్తి నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

పూర్వ చరిత్ర[మార్చు]

పూర్వం ఈ ప్రాంతానికి కదంబవాడి అని పేరు. దానికి నిదర్శనంగా ఇక్కడ కదంబ వృక్షాలీనాడు ఈ ప్రదేశంలో కనబడుతాయి. ఈ ప్రాంతాన్ని పూర్వం పశ్చిమ చాళుక్య సామంతులైన ఎరువ చోళులు పాలించారు. ఆ చోళులు కొణిదెన వారిలో ఓ శాఖ. కొణిదెన వారిలో మూల పురుషుడు కరికాలుడు. అతని కుమారుడు మహిమానుడు; అతనికి కరికాలుడు, తొండమానుడు, దశవర్మ అని ముగ్గురు కుమారులుండేవారు. వారిలో కరికాలునిశాఖ కొణిదెనలో నిలిచి పోయింది. మూడోవాడైన దశవర్మ శాఖ గంగాపుర ప్రాంతం వచ్చిందని కొత్త భావయ్య చౌదరి మతం. అలాగే శాసనాల్లోని ప్రశస్తిని మూలపురుషుని పేరుని బట్టి చూస్తే రెండో వాడైన తొండమానుని శాఖ కోడూరికి వచ్చారని తెలుస్తున్నది. కృష్ణానది కన్నడ శాసనాల్లో ఏర అని వ్యవహారముంది. తెలంగాణలో ఆనదిని ఏరనే పిలుస్తారు. చోళులు రేనాటి నుండి విస్తరించిన తరువాత కొందరు కృష్ణా తీరాన క్రమించి, ఏటి దరియైన ఆరాజ్యానికి ఏరువ అని నామకరణం చేసారు. ఏరువను పాలించారు కనుక వారిని ఏరువ చోళులు అయ్యారు.చోళులు తమిళులు. వారిది సింహలాంచనం. రేనాటికి వచ్చిన పిమ్మట వారు నల్లమలలోని ప్రధాన జీవం వ్యాఘ్రాన్ని తమ లాంచనంగా తెస్సుకోగా వారి నుండి వెరైన ఏరవ చోళులు గోవత్సాలను తమ లాంచనంగా స్వీకరించారు. ఈ విధంగా వారు తమిళచోళుల నుండి రేనాటి చోళులు వేరైనట్లు రేనాటి చోళుల నుండి ఏరవ చోళులు వేరైయ్యారు.పాలమూరు ప్రాంతానికి వచ్చిన చోళులు మొదట కోడూరిని తమ రాజధానిగా చేసుకున్నారు. ఆనాడు వారి ఆధీనంలో 300 గ్రామాలుండేవి. కనుక వారి రాజ్యానికి కోడూరి మున్నూటి అని పేరుండేది. అటుపై చోళులు కోడూరి నుండి కందూరికి వచ్చిన పిమ్మట వారినాశ్రయించిన రాజబంధువులందరు ఆ సమీపంలో తమ రాజుల పేర చోళపురం అనే గ్రామాన్ని స్థాపించు కున్నారు. అదీనాడు షోలీపురం. ఈ వట్టెం గ్రామం ఈ 300 గ్రామాలలో ముఖ్యమైనది.ఈ గ్రామానికి మొదట లింగాపురమని పేరు.ఈ గ్రామం పూర్వం శ్రోత్రియాగ్రహారం. దీన్ని చింతలపల్లివారు, గంగాపురం వారు, ఖండవల్లి వారు అనే మూడు కుటుంబాలకు కలిపి రెడ్డిరాజులు అగ్రహారంగా ఉండేది. వీరికి ముందు నుంచే చోళుల కాలం నుంచే చాలా మంది కవి పండితులు నివశించేవారు. వారిలో ముఖ్యులు అప్పయ కవి. అటుపై చింతలపల్లి ఎల్లనార్యుడు.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1043 ఇళ్లతో, 4918 జనాభాతో 2445 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2450, ఆడవారి సంఖ్య 2468. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 825 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 633. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 575748[3].పిన్ కోడ్: 509203.

2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4180. ఇందులో పురుషుల సంఖ్య 2095, స్త్రీల సంఖ్య 2085. గృహాల సంఖ్య 878.

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం[మార్చు]

ఈ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము చాలా ప్రసిద్ధి గాంచింది. ఈ గ్రామానికి ఆగ్నేయంగా మరో గట్టు ఉంది. అది గుద్లనర్వ, వట్టెం గ్రామాల నడుమ అడ్డంగా ఉంది, కాబట్టి అడ్డ గట్టు అంటారు. దానిపై ఒక సొరికలో పురాతనమైన లింగ ప్రతిష్ఠ ఉంది. ఆ దేవుని పేర పూర్వం గుట్ట కింద లింగాపురం ఉంది. దాని క్షేత్ర పాలకుడుగా వేంకటేశ్వరుడు ఆ గుట్ట పై ఉన్నాడు. అందుచే దానికి క్షేత్ర పాలకుని గుట్ట అని కూడా అంటారు. లింగాపురం అనంతరకాలంలో వట్టెం గ్రామంగా మారింది. తెలంగాణలో చిన్న తిరుపతిగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలోని దైవం వట్టెం వెంకటేశ్వర స్వామిగా నిత్యం పూజలు అందుకుంటున్నాడు.[4]

గుడ్లనర్వకు చెందిన ఈ జిల్లాకు భగవన్నామ ప్రచారకుడైన శ్రీ చింతకుంట నరసింహా రావు గారు ఆయన ఆశ్రమం కొరకు ఈ గట్టు పై ఉన్న స్థలాన్ని తీసుకొని, దాని పక్కన శ్రీ కుసుమ హరనాథ్ బాబా ఆశ్రమాన్ని నెలకొల్పినాడు. అనంతరం అతనికి, పాలెంలో వెంకటెశ్వరుడు వున్నాడు కాబట్టి ఇక్కడ పద్మావతి అమ్మవారిని ప్రతిష్ఠించాలని సంకల్పం కలిగి, అప్పటి జిల్లా కలెక్టరు గారు అయినటువంటి శ్రీ జి.నారాయణ్ రావు గారి నడుగగా ఆయన, ప్రభుత్వం పురాతన ఆలయాలు పునరుద్దరించటానికి ఆర్థిక సహాయం చేస్తుంది గాని, కొత్త ఆలయాలకు చేయదని చెప్పగా, అది విని శ్రీ నరసింహా రావు గారు అక్కడ ఉన్న క్షేత్రపాలకుని గుడినే పునరుద్ధరించ తలచి ఆలయ నిర్మాణం తలపెట్ట గ్రామ సర్పంచి ఏదుల సుదర్షన్ సహాయంతొ తిరుమల తిరుపతి దేవస్థానంలో మొదటి గ్రాంటు సంపాదించాడు. కాని ఆ డబ్బు సరిపోనందున పి.డబ్లూ.డి శాఖలో ఇంజనీరుగా, కాంట్రాక్టరుగా పనిచేస్తున్న వట్టెం గ్రామ నివాసి అయినటు వంటి శ్రీ సందడి రంగారెడ్డి గారిని సంప్రదించగా, స్వామి వారే తన సన్నిధికి వచ్చినట్లుగా సంబర పడి ఆలయ భారాన్నంతటినీ తన భుజస్కందాలపై ఎత్తుకుని ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తేది:4-11-1982 నాడు ప్రభుత్వ చేనేత శాఖామాత్యులు శ్రీ పాల్వాయి గోవర్ధన రెడ్డి గారి చే శంకుస్థాపన జరిగింది. అనంతరం శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారి కరకమలాలతో తేది:19-5-1986 నాడు పాంచ రాత్రాగమోక్తానుసారంగా స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది.

ఈ ఆలయానికి హైదరాబాద్ నివాసి బాదం రామస్వామి గారు రోడ్డు దగ్గర మహాద్వారం చేయించగా, గోపాల్ పేట నివాసి శ్రీ యం.ప్రతాప్ రెడ్డి గారు మంఠపం కట్టించారు. స్వామి వారికి కుడివైపున విశాలమైన సత్రశాల కట్టించగా, ఎడమ వైపున హైదరాబాద్ నివాసి శ్రీ కపిలవాయి రాధాకృష్ణ గారు హనుమంతుని ప్రతిష్ఠ తేది: 16-2-1990 నాడు చేయించారు. ఈ గుట్టపైకి వాహనములు వెళ్ళుటకు తారురోడ్దు మార్గము ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప బాలబడి నాగర్‌కర్నూల్లో ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నాగర్‌కర్నూల్లో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల మహబూబ్ నగర్లోను, పాలీటెక్నిక్‌ వనపర్తిలోను, మేనేజిమెంటు కళాశాల నాగర్‌కర్నూల్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నాగర్‌కర్నూల్లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల మహబూబ్ నగర్ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

వత్తెంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

వత్తెంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

వత్తెంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 330 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 120 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 85 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1910 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 1790 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 120 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

వత్తెంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • బావులు/బోరు బావులు: 61 హెక్టార్లు* చెరువులు: 59 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

వత్తెంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

ప్రత్తి, రాగులు

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
 2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
 3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 4. "Namrata Shirodkar: వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నమ్రత శిరోడ్కర్". web.archive.org. 2023-03-07. Archived from the original on 2023-03-07. Retrieved 2023-03-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వట్టెం&oldid=3858974" నుండి వెలికితీశారు