చిన్న జీయర్ స్వామి
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి | |
---|---|
![]() | |
జననం | నారాయణాచార్యులు 1956 అక్టోబరు 31 అర్తమూరు, మండపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
జాతీయత | భారతీయుడు |
భాగస్వా(ములు)మి | అవివాహితుడు |
క్రమము | జీయర్ (సింహం)[1] |
తత్వం | విశిష్టాద్వైతం |
ఉల్లేఖన | మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ. స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. |
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఒక వేద గురువు, ఉపదేశకుడు, శ్రీవైష్ణవ ప్రముఖుడు. ఈయన 31 అక్టోబర్ 1956న చిలకమర్రి అలుమేలుమంగతాయారు, డాక్టర్ కృష్ణమాచార్యుల దంపతులకు జన్మించాడు.[2]
ప్రారంభ జీవితం[మార్చు]
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు, దీపావళి పండుగ రోజున రాజమండ్రి సమీపంలోని అర్తమూరులో అలమేలు మంగతాయారు, వేంకటాచార్యులు గార్లకి శ్రీమన్నారాయణాచార్యులుగా జన్మించారు. ఈ సమీపంలోని గౌతమ విద్యాపీఠంలో స్వామి వేద గ్రంథముల, వైష్ణవ సంప్రదాయాలలో శిక్షణ పొందారు. తర్క శాస్త్రం, సంస్కృత భాషను నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వద్ద అభ్యసించారు. స్వామి 23 సంవత్సరాల వయసులో ఐహిక సుఖములను త్యజించి సన్యాసిగా మారతానని ప్రమాణం చేసారు, దీని పర్యవసానంగా జీయర్ అయ్యారు
సన్యాస జీవితం[మార్చు]
సన్యాస స్వీకరణ తర్వాత కొన్నేళ్లకు గీతాజ్యోతి ఉద్యమాన్ని చేపట్టారు. గీతాజ్యోతి ఉద్యమం కేవలం భగవద్గీత ప్రాచుర్య రూపకాన్నే కాక, సమాజంలో ఉన్న సోమరితనాన్ని తొలగించే, సౌభ్రాతృత్వ భావనను ప్రతి ఒక్కరిలో మేల్కొల్పగలిగే వ్యూహంగా కూడా రూపుదిద్దుకుంది. ఆ ఉద్యమ రూపకల్పన తర్వాత ఎంతోమంది మాకు అద్భుతమైన ఖాళీ సమయం దొరుకుతుంది, ఇప్పుడు మేము ఆ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనగలుగుతున్నామని చెప్పడం గమనార్హం. అక్కడితో స్వామివారు వారి కర్తవ్యం పూర్తి అయిందని అనుకోలేదు. అంధులను చేరదీసి వారు కళ్లు లేకున్నా.... కంప్యూటర్ విద్యలో గొప్ప నిపుణులు అవ్వాలని, ఎన్నో చోట్ల కాలేజీలని స్థాపించారు. అక్కడ అంధులకు శిక్షణనిచ్చేటందుకు, కొందరు నిపుణులను నియమించారు.
వేదం అనగా విశ్వకోటికి విజ్ఞానాన్ని అందించేది, మోక్ష సాధనకు పునాది అయిన విద్య వేదం. అలాంటి వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి, ఎన్నో ఆశ్రమాలను స్థాపించారు స్వామివారు. విద్య అనేది ఒక వర్గానికో, వర్ణానికో కాక, మానవాళికంతటికి అందాలనే ఉద్దేశంతో ఆ వేద పాఠశాలలనే గురుకుల పాఠశాలలుగా మలచి, అన్ని రకాల విద్యలనీ బోధించే సౌకర్యాన్ని ఆ పాఠశాలల్లో కల్పించారు12నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. దీన్నిబట్టి స్వామివారి పట్టుదల, స్వామివారికి విద్యపై ఉన్న గౌరవం, ప్రేమ అర్థం చేసుకోవచ్చు. ధార్మిక సైనికులను తయారు చేయడంలో, కీలకపాత్ర పోషించారు. . శ్రీరామ నగరం, శంషాబాద్ లో జిమ్స్ అనేటటువంటి ఒక ఆస్పత్రిలో ఉచిత వైద్య విధానాన్ని ప్రవేశపెట్టి, వైద్యరంగ పరమైన అనుగ్రహాన్ని కూడా స్వామివారు సమాజంపై చూపినారు. అయితే..... మరలా సోమరితనపు ఛాయలు కమ్ముతున్న సమయంలో శాంతి సుందరం కార్యక్రమం నిర్వహించారు. ఆ పిదప ఎన్నో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలనిర్వహణ జరిగాక, రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహణ చేస్తున్నారు.
అవార్డు:
2023 – భారత ప్రభుత్వం చే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-10. Retrieved 2015-12-17.
- ↑ ఆంధ్రభూమి (29 October 2016). "ఆధ్యాత్మిక శక్తి.. మానవతామూర్తి (అక్టోబర్ 31 స్వామీజీ షష్ట్యబ్ది మహోత్సవం)". Archived from the original on 13 జనవరి 2022. Retrieved 13 January 2022.

అవార్డు: