పాల్వాయి గోవర్ధన్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి


రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
3 ఏప్రిల్ 2012 (2 మే 2014 నుండి తెలంగాణ రాష్ట్రం) – 9 జూన్ 2017
తరువాత బండ ప్రకాష్, తెలంగాణ రాష్ట్ర సమితి
నియోజకవర్గం తెలంగాణ

ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
1967-72, 1972-78, 1978-83, 1983-85, 1999-2004
నియోజకవర్గం మునుగోడు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1936-11-20)1936 నవంబరు 20
ఇడికుడ, చండూరు మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
మరణం 2017 జూన్ 9(2017-06-09) (వయసు 80)
కులు, హిమాచల్ ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు రంగారెడ్డి - అనసూయమ్మ
జీవిత భాగస్వామి సృజమణి
సంతానం ముగ్గురు పిల్లలు (శ్రావణ్ కుమార్ రెడ్డి, పాల్వాయి స్రవంతి, డాక్టర్ శాంతన్ రెడ్డి
వెబ్‌సైటు www.palvai.in

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (20 నవంబరు 1936 - 9 జూన్ 2017)[1] తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ తరపున పలు ఎన్నికల్లో పోటీ చేశాడు.[2] పార్లమెంటు సభ్యునిగా (రాజ్యసభ) కూడా ప్రాతినిధ్యం వహించాడు.[1] 1967-72, 1972-78, 1978-83, 1983-85, 1999-2004 కాలంలో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు. 2007-09 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా కూడా ఉన్నాడు.[3] భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గంలో పనిచేశాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

గోవర్ధన్ రెడ్డి 1936, నవంబరు 20న రంగారెడ్డి - అనసూయమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, చండూరు మండలంలోని ఇడికుడ గ్రామంలో జన్మించాడు. స్వగ్రామంలో ఇంటి వద్ద 2వ తరగతి వరకు చదివాడు. తన గ్రామంలో పాఠశాల సౌకర్యాలు లేకపోవడంతో చదువు పూర్తి చేసేందుకు తన మేనమామ గ్రామం మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం గ్రామానికి వెళ్ళాడు. రజాకార్ల ఉద్యమం కారణంగా వివిధ ప్రాంతాలలో తన చదువును కొనసాగించాడు. ఆ తర్వాత 1951లో హైదరాబాద్‌లో స్థిరపడి సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. 5వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో, తర్వాత తెలుగు మీడియంలో చదివాడు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని వివేకవర్ధిని కళాశాలలో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. 1967లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో ఉత్తీర్ణత సాధించాడు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలం లేదళ్ల గ్రామానికి చెందిన నారాయణరెడ్డి-సరోజనమ్మ దంపతుల ఏకైక కుమార్తె సృజమణితో 1962, జూన్ 16న హైదరాబాద్‌లో గోవర్ధన్ రెడ్డి వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు శ్రావణ్ కుమార్ రెడ్డి (1971), స్రవంతి (1973), డాక్టర్ శాంతన్ రెడ్డి (1976).[5]

భార్య సృజామణితో పాల్వాయి

రాజకీయ జీవితం

[మార్చు]

పాల్వాయి యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని వీడకుండా అందులోనే ఉన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబాలతో ఆయనకు మంచి పరిచయం ఉంది. 1967 లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1967 నుండి 1985 వరకు, 1999 నుండి 2004 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాడు. [6]భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గంలో పనిచేశాడు. 2017తో ఆయన రాజ్యసభ సభ్యుడి పదవీకాలం ముగిసింది.[7]

ఎన్నికల వివరాలు

[మార్చు]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2009 93 మునుగోడు జనరల్ ఉజ్జిని యాదగిరిరావు పు భారత కమ్యునిస్టు పార్టీ 57383 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ 53789
1999 293 మునుగోడు జనరల్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ 45134 మార్కండేయ జెల్ల పు తె.దే.పా 41095
1994 293 మునుగోడు జనరల్ ఉజ్జిని నారాయణరావు పు భారత కమ్యునిస్టు పార్టీ 55209 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు స్వతంత్ర 23655
1989 293 మునుగోడు జనరల్ ఉజ్జిని నారాయణరావు పు భారత కమ్యునిస్టు పార్టీ 51445 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ 43183
1983 293 మునుగోడు జనరల్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ 30084 బొమ్మగాని ధర్మభిక్షం పు భారత కమ్యునిస్టు పార్టీ 19773
1978 293 మునుగోడు జనరల్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ 31635 కంచర్ల రామకృష్ణారెడ్డి పు జెఎన్‌పి 18004
1972 286 మునుగోడు జనరల్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ 24995 ఉజ్జిని నారాయణరావు పు భారత కమ్యునిస్టు పార్టీ 16266
1967 286 మునుగోడు జనరల్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ 26204 ఉజ్జిని నారాయణరావు పు భారత కమ్యునిస్టు పార్టీ 10582

ఇతర వివరాలు

[మార్చు]
  • నది నీటి నిర్వహణ అంశాలపై ఇతనికి ఆసక్తి వుండేది. కృష్ణా, గోదావరి నదీ జలాల నిల్వ, వినియోగంపై సవివరమైన ప్రాజెక్టు నివేదికలను తయారు చేశాడు. తెలంగాణలోని బంజరు ప్రాంతాలకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చదన్న బలంగా నమ్ముతూ పులిచింతల, పోలవరం ప్రాజెక్టులను తీవ్రంగా వ్యతిరేకించాడు.
  • వ్యవస్థాపక సభ్యుడు, గౌరవ పోషకుడిగా 1986లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ను స్థాపించాడు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు.

మరణం

[మార్చు]

గోవర్ధన్ రెడ్డి హిమాచల్ ప్రదేశ్‌లోని కులు పట్టణంలో జరిగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు వెళుతున్నప్పుడు 2017, జూన్ 9న గుండెపోటుతో మరణించాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Garikapati Mohan Rao". Government Of India. Retrieved 12 October 2015.
  2. "కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి కన్నుమూత". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 9 June 2017. Retrieved 9 June 2017.
  3. "Palvai Govardhan Reddy Biography". Elections.in. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 12 October 2015.
  4. "Biography: Palvai Govardhan reddy". palvai.in. Retrieved 12 October 2015.
  5. "ఎలక్షన్స్.ఇన్ లో గోవర్ధన్ రెడ్డి ప్రొఫైలు". elections.in. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 17 June 2017.
  6. Sakshi (14 October 2023). "ఎమ్మెల్యేలయ్యారు.. ఎంపీలూ అయ్యారు!". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  7. Sakshi (27 November 2018). "హ్యాట్రిక్‌.. వీరులు!". Sakshi. Archived from the original on 2 June 2021. Retrieved 2 June 2021.
  8. Vasireddy, Amrutha (9 June 2017). "Congress veteran Palvai Govardhan Reddy dies of cardiac arrest". The Times of India. Retrieved 24 June 2019.