పాల్వాయి స్రవంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాల్వాయి స్రవంతి
నియోజకవర్గం మునుగోడు

వ్యక్తిగత వివరాలు

జననం 1974
ఇడికుడ, చండూరు మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, సృజమణి

పాల్వాయి స్రవంతి తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, రాజకీయ నాయకురాలు. ఆమె 2022లో మునుగోడు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారైంది.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

పాల్వాయి స్రవంతి 1974లో తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, చండూరు మండలం, ఇడికుడ గ్రామంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, సృజమణి దంపతులకు జన్మించింది. ఆమె ఎల్ఎల్ఎం పూర్తి చేసింది.

రాజకీయ జీవితం[మార్చు]

పాల్వాయి స్రవంతి తన తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి తరపున మునుగోడులో ప్రచారంలో పాల్గొంది. ఆమె తన తండ్రి మరణాంతరం పూర్తి స్థాయిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆమె మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించగా పొత్తుల్లో భాగంగా ఆ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 27,441 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

పాల్వాయి స్రవంతి 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆమె మునుగోడు ఆశించింది, కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ దక్కడంతో ఆమె స్వచ్ఛందంగా పోటీ నుంచి త‌ప్పుకుని ఆయన గెలుపు కోసం ప‌ని చేసింది. మునుగోడు శాసనసభ్యుడిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టు 2న కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2022లో జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.[2][3]

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (9 September 2022). "మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి". Archived from the original on 13 September 2022. Retrieved 13 September 2022.
  2. Deccan Chronicle (9 September 2022). "Munugode by-election: Palvai Sravanthi is Congress candidate" (in ఇంగ్లీష్). Archived from the original on 13 September 2022. Retrieved 13 September 2022.
  3. The Hindu (9 September 2022). "Palvai Sravanthi is Munugode Congress candidate" (in Indian English). Archived from the original on 13 September 2022. Retrieved 13 September 2022.